మంద కృష్ణ మాదిగపై కుట్ర CMO కనుసన్నల్లో యాక్షన్ టీమ్స్
( జమాల్పూర్ గణేష్,
మూల్పూరు రాజేంద్ర బాబు )
మాదిగల ABCD వర్గీకరణ ఉద్యమ ఫలాలను సాధించి పెట్టిన MRPS అధినేత మంద కృష్ణ మాదిగను టార్గెట్ చేశారు CM రేవంత్ రెడ్డి.
గల్లి నుండి ఢిల్లీ దాకా గిన్నిస్ రికార్డులో నమోదు కాగలిగిన ఉద్యమాలను నిర్మించి, మాదిగల ఆరాధ్యదైవంగా స్థిరపడిన మంద కృష్ణ మాదిగ ప్రతిష్టను మసక పారించే సరికొత్త కుట్రకు ముఖ్యమంత్రి కార్యాలయం అడ్డాగా మారింది.
స్వయంగా CM కనుసన్నల్లోనే MRPS ను బలహీన పరచి..ప్రత్యామ్నాయ మాదిగ పోరాటాల కోసమని మంద కృష్ణ మాదిగకు కౌంటర్ ఉద్యమాలను నిర్మించ బోతోంది రేవంత్ రెడ్డి టీమ్.
మాదిగ ఉద్యోగుల సమన్వయ కమిటీ పేరిట సీఎం రేవంత్ రెడ్డికి సన్మానం చేసిన కార్యక్రమానికి ముందునుంచే ఈ టీమ్ రంగంలో దిగింది.
మంత్రులు దామోదర రాజనర్సింహ, అడ్లూరు లక్ష్మన్,కడియం శ్రీహరి పర్యవేక్షణలో సీఎం ఆఫీసు ఆదేశాల మేరకు జిల్లాల వారిగా కార్యాచరణకు దిగింది ఆ టీమ్.
న్యూట్రల్ వ్యక్తిగా, లెఫ్ట్ భావజాలం ఉన్న మేధావిగా గుర్తింపు కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాసీం ను ముందుంచి పని కానిస్తుంది చీఫ్ మినిష్టర్ ఆఫీసు.
సీఎం అభినందన సభకు వచ్చిన మాదిగ ఉద్యోగులలతో పాటు ఆయా రంగాలకు చెందిన మాదిగ సామాజిక వర్గ ముఖ్యులను సమికరించే పనిలో ఉన్నారు..
వీరందరినీ జిల్లాల వారిగా ఏకం చేసి ఖాసీం నాయకత్వంలో జిల్లాల వారిగా సమావేశాలను నిర్వహించే పని క్షేత్ర స్థాయిలో మొదలయ్యింది.
దీనికోసం తెలంగాణ 33 జిల్లాల్లో సీఎం టీమ్స్ మాదిగల ఏకీకరణ పనిలో నిమగ్నమయ్యాయి.
దీనిలో భాగంగా మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తున్నరు..ఆయన సోమవారం నిజామాబాద్ లో PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది..
ఈ నెలాఖరులోగా జిల్లాల్లో మంద కృష్ణ మాదిగకు కౌంటర్ ఉద్యమాల మీద బ్లూ ప్రింట్ తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు సీఎం పురామయించిన నేతలు..
ఎందుకిలా అంటే?
తెలంగాణలో 50 లక్షల జనాభా కలిగిన మాదిగలను వర్గీకరణ ఉద్యమం నీడలో ప్రబల రాజకీయ శక్తిగా మలిచారు మంద కృష్ణ మాదిగ.
దీనికే పరిమితం కాకుండా స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రభావితం చేసి ఆరోగ్యశ్రీని సాధించి పెట్టారు.
వికలాంగుల హక్కుల సాధకుడిగా వారి మద్దతు కూడగట్టారు మంద కృష్ణ.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సంప్రదింపుల ద్వారా వర్గీకరణకు చట్ట బద్ధత సాధించారు.
దశాబ్దాల ఉద్యమానికి ధర్మబద్ద ముగింపు ఇచిందానికి మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చారు మంద కృష్ణ.
దేశ వ్యాప్తంగా కూడా బీజేపీకి ప్రయోజనం చేకూర్చే మంద కృష్ణ ను దారిలోకి తెచ్చుకోవడం సాధ్యం కాదనే తలంపుతో సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఎటాక్ కు దిగారు.
మంద కృష్ణ ఎత్తులు;
చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి,కేసీఆర్ లాంటి ఉద్దండులతో ఏగిన మంద కృష్ణ మాదిగ రేవంత్ రెడ్డి కౌంటర్ ఎటాక్స్ పై పై ఎత్తులు వేస్తున్నారు.
దీనిలో భాగంగానే MRPS ఉద్యమ శక్తులతో ఖాసీం వర్గం మీద రాజకీయ దాడి మొదలు పెట్టించారు.
వర్గీకరణ ఉద్యమంలో కీలకంగా పని చేసి ప్రస్తుతం స్తబ్దుగా ఉన్న వారిని తట్టిలేపే పనిలో బిజీ అయ్యింది మంద కృష్ణ టీమ్.
దీనికి తోడు ఆరు సార్లు ఎమ్మెల్యే గా పని చేసిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కూడా మంద కృష్ణ తో జత కట్టడానికి రెడీ అయ్యారు..
ఈ నేపథ్యంలో నర్సింహులు రేవంత్ రెడ్డి పై రాజకీయ దాడి మొదలు పెట్టారు.
కేసీఆర్ హయాంలో సైతం కృష మాదిగ 'మంద' ను ఆగం చేసే ఎత్తుగడ అమలు జరిగినా అనుకున్న లక్ష్యాన్ని ఛేదించలేక పోయారు..
మరి ఇప్పుడు.....?
