Posts

Showing posts with the label Telangana politics

ఏనుగు దంతాలు ఊడినయ్.. శ్రేణులు ఆగం అయ్యినయ్

Image
(జమాల్పూర్ గణేష్ /మూల్పూరు రాజేంద్ర బాబు)   ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో వెలిగిన ఏనుగు రవీందర్ రెడ్డి ప్రస్తుతం గంజిలో పడ్డ ఈగ చందంగా మారింది. "ఏనుగు దంతాలు ఊడినయ్-శ్రేణులు అయోమయంలో పడినయ్" అంటూ రాజకీయ ప్రత్యర్ధులు రాగాలు తీస్తున్నారు.. ఈ విచిత్ర అరుదైన రాజకీయ పరిస్థితులపై మన నిజామాబాద్ అందిస్తున్న స్పెషల్ ఫోకస్ ఇది.. ఏనుగు రవీందర్ రెడ్డి TRS రాజకీయ ప్రస్థానంలో ఒక వెలుగు వెలిగారు. ఆ పార్టీ నుంచి ఎల్లారెడ్డి సీనియర్ MLA గా తిరుగు లేని ఆధిపత్యం చెలాయించారు..ఆ ఊపుతోనే ఈటెల రాజేందర్ తో బీజేపీలో చేరి హల్చల్ చేశారు.. అక్కడ వర్కవుట్ కాక కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని బాన్సువాడ బాద్షా కావాలని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అప్పటి BRS సిట్టింగ్ MLA పోచారం శ్రీనివాస్ రెడ్డికి చుక్కలు చూపించారు.. తానోడినా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పోచారం కు చెక్ పెట్టారు.. బాన్సువాడ సెగ్మెంట్ లో ఇసుక పోయింట్స్ కంట్రోల్ లోకి తెచ్చుకుని కల్లం లో కుప్పలుగా ఎగబోసుకున్నారు.. పోలీస్, రెవెన్యూ తో పాటు అధికారులను చెప్పుచేతల్లో పెట్టుకుని పోచారం శ్రీనివాసరెడ్డి కి ఊపిరి ఆడనీయలేదు ఏనుగు రవీందర్ రెడ్డి.. ఈ పరిస్థ...

మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ బిగ్ ఫైట్.. పూజల్లో తరిచిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Image
(జమాల్పూర్ గణేష్ /మూల్పూరు రాజేంద్ర బాబు) హైదరాబాద్, జులై 2; తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్లు ఉంది రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారం.. అచ్చం ఈ సామెతకు సరిపోయే రాజకీయ సన్నివేశాలు హైదరాబాద్ గడ్డ మీద ఆవిష్కృతం అయ్యాయి. వివరాల్లోకి వెళితే... ప్రభుత్వం ,ప్రధాన ప్రతిపక్షమైన BRS నడుమ గురువారం హైదరాబాద్ లో బిగ్ ఫైట్ జరిగింది.. రేవంత్ రెడ్డి ఘన కార్యాలను తెలంగాణ భవన్ కు వచ్చి చెబుతా అని మంత్రి జూపల్లి సవాల్ విసిరారు. దానికి స్పందించిన కేటీఆర్, హరీష్ రావు ఇన్ టైంలో వచ్చి కూర్చున్నారు.అదే టైంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి బస్తీమే సవాల్ అంటూ గన్ పార్క్ అమర వీరులస్తూపం వద్ద బహిరంగ చర్చ కోసం మకాం వేశారు.. అక్కడికి చేరుకునేందుకు మొదట హరీష్ రావు తెలంగాణ భవన్ బయట పోలీసులతో పెద్ద యుద్ధమే చేశారు. తోపులాట,పోలీసుల బల ప్రయోగంతో హరీష్ కింద పడి పోయారు.. ఈ నాటకీయ రాజకీయ పరిణామాలు గురువారం రాష్ట్ర వ్యాపితంగా హల్చల్ రేపాయి. సీన్ కట్ చేస్తే.. ఈ మొత్తం వ్యవహారంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆంటీ ముట్టనట్లు ఉన్నారు. ఎక్కడా కనపడలేదు.. పల్లెత్తు మాట్లాడలేదు..రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో మం...

నో టికెట్ గ్యారెంటీ..! గేరు మార్చిన బీఆర్ఎస్.. మాజీ ఎమ్మెల్యేల్లో టెన్షన్

Image
(జమాల్పూర్ గణేష్ /మూల్పూరు రాజేంద్ర బాబు) కారు పార్టీ గేరు మార్చింది.. ఆ స్పీడుకు MLA టికెట్ల ఆశావాహుల కండ్లు బైర్లు కమ్ముతున్నాయి.. రామన్న, హరిషన్న చుట్టూ ప్రదక్షిణ చేసి.. మస్క పాలిస్ తో టికెట్ కొట్టేయొచ్చనే ఆశలు ఆడియాసలే నన్న అంచనా కొచ్చారు BRS మాజీ MLA లు..ఇంత కాలం పట్న వాసానికి మరిగిన వీళ్ళు అబ్బా మళ్ళీ ఊరు బాట పట్టాలా అంటూ ఉసూరు మంటున్నారు..10ఏళ్ళు అధికారం చెలాయించి, సుఖానికి మరిగిన మాజీ MLA లు ఇప్పుడిపుడే పల్లె బాటను వెతుక్కుంటున్నరు. ఎవరికి వారు విధిగా ఓడిన చోటే విజయానికి మెట్లు వేసుకుంటారేనని అధిష్ఠానం రెండేళ్లు సమయం ఇచ్చి చూసింది.. అయినా మాజీలు పట్నం వీడలేదు.. అందుకే బూతు లెవల్ లో పార్టీ నిర్మాణం, సర్ ప్రోగ్రామ్ ను జోడించి అధిష్టానమే కార్యాచరణ ఇచ్చింది. దీనితో తప్పని పరిస్థితుల్లో మాజీ MLA లు నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు పూర్తి చేశారు.మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలో మాజీలు టీమ్ గా ఏర్పడి పర్యటిస్తున్నారు.. అయినా వారిని టికెట్ నో గ్యారంటీ అనే మాట నిద్రపోనిస్తా లేదు. "గతాన్ని చూసి టికెట్లు ఇచ్చేది లేదు..ఎంత సీనియర్..ఎన్ని టర్మ్ లు MLA గా పని చేసారు అనేది ల...

తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ ఎలా ఉంది..? ప్రజలేమనుకుంటున్నారు..?

Image
*ప్రజలేమనుకుంటున్నారు..?* ......... (కొండల్ ,సీనియర్ జర్నలిస్టు) డేంజర్ బెల్స్ తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ ఎలా ఉంది.? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్న తరహాలో 2034 ఎన్నికల నాటికి ఆయన సేఫ్ గా జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టే పరిస్థితి ఉన్నదా..? నాయకులు, ప్రజాప్రతినిధులు భావిస్తున్నట్లు తెలంగాణలో “లోకమంతా పచ్చగా” ఉందా..? ఇది వందిమాగధుల అభిప్రాయం కాదు. ఆస్థాన విశ్లేషకుల చిట్టా అంతకంటే కాదు. కానీ జనబాహుళ్యం ప్రతిస్పందన కూడా ఒకసారి ప్రభువులకు చేరాల్సి ఉంది. వాళ్లు భావిస్తున్నట్లు ఇప్పుడు తెలంగాణలో అధికార పార్టీకి ఆశాజనకమైన ఫలితాలు వచ్చే పరిస్థితి లేదు. పలు అంశాల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వివాదాస్పద శైలి, నిరంకుశత్వాన్ని నిర్భీతిగా నిరసించిన తెలంగాణ ఓటర్లకు నచ్చడం లేదు. తెలంగాణ అంటేనే ధిక్కారం. ప్రజల అవసరాలకు భిన్నంగా వ్యవహరించే ప్రభువులను ధిక్కరించే సంస్కృతి ఇక్కడిది. రాష్ట్రాన్ని సాధించానని అభిప్రాయంతో తనకిష్టమొచ్చిన రీతిలో పరిపాలించవచ్చని భావించిన కేసీఆర్ కు పదేళ్ల తరువాత పరాభవం తప్పలేదు. ఆయన పరాభవం తమ ప్రతిభ వల్ల అని ఎవరైనా భావిస్తే వాళ్లకు కూడా శంకరగిరి మాన్యాలు తప్పవని ...

విద్య, వైద్యం ఫ్రీగా ఇవ్వకుంటే రాళ్లతో కొట్టండి...

Image
విద్య వైద్యం ఫ్రీగా ఇవ్వకుంటే రాళ్లతో కొట్టాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తాము ఇచ్చిన పాంచజన్యంలో పేర్కొన్న ఐదు అంశాలను అమలు చేయకుంటే గన్ పార్క్ లోని అమరుల స్థూపం స్తంభానికి కట్టేసి కొట్టాలని సూచించారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొని జర్నలిస్ట్ లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పారు. తన తండ్రి కేసీఆర్ తో తనకు పంచాయితీ లేదని బీఆర్ఎస్ అధ్యక్షుడిగానే ఆయననను విమర్శించానని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు వచ్చిన సరే తెలంగాణ ప్రజల కోసం తాను ముందుకే వెళ్తానన్నారు. తన టార్గెట్ సర్వోదయ తెలంగాణ సాధించటమేనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు ఎవరైతే విలనో...తనకు కూడా వాళ్లే విలన్ అని చెప్పారు. కేసీఆర్ ను రాజకీయ నేతగానే విమర్శించానని తండ్రిగా ఆయనతో ఎలాంటి సమస్య లేదని చెప్పారు. రాళ్లతో కొట్టండి:- తెలంగాణ రక్షణ సేన ప్రకటించిన పాంచజన్యం లోని ఐదు అంశాలు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల విషయంలో తాను ఇచ్చిన మాట తప్పితే అమరవీరుల స్తూపం వద్ద స్తంభానికి కట్టేసి కొట్టాలని కల్వకుంట్ల కవిత తెలిపారు. అ...

కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదు - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

Image
రాష్ట్రంలో రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు ఓటు వేసే అవకాశమే లేదని, తిరిగి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనీసం 20 సంవత్సరాల పాటు అధికారంలోకి రావడం కల్లని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అడ్డగోలుగా హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్గాలను మోసం చేసిందని, దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి అరాచకాలు, కుంభకోణాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈరోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలతో ఒక సుదీర్ఘ సమీక్ష సమావేశాన్ని కేటీఆర్ గారు నంది నగర్ లోని తన నివాసంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు పార్టీని బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన కార్యాచరణ పైన దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి అడ్డగోలుగా పెరిగిపోయిందని, అన్ని అంశాల్లోనూ కాంగ్రెస్ పార్టీ కమీషన్లు, కాసుల కక్కుర్తి కోసమే చూస్తున్నదని కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లాలో భూములతో పాటు అనేక మైనింగ్ కుంభకోణాలకు కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులే స్వయంగా పాల్పడుతున్న పరిస్థితి నెలకొన్నదన్నారు. కాంగ...

50 కోట్ల భూమి.. 5 లక్షలకే.. -కాంగ్రెస్ కాయ్ రాజా కాయ్

Image
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ లేదు అనేది పాత సామెత. అభినవ రాజులు తలుచుకుంటే సర్కారు భూములు చిటికెలో చెర లోకి రావడమనేది కొత్త నానుడి. రాజకీయ పోకడతో రాజులుగా వర్ధిల్లుతున్న వారు అనుకున్నదే తడవుగా అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూమి అధికార కాంగ్రెస్ కు సొంతం అయ్యింది..1965 లో అప్పటి జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు మాధవరావు నేతృత్వంలో కొంచెం అటు ఇటుగా 3000 గజాలకు పైగా కాంగ్రెస్ పార్టీ సొంతం అయ్యింది. నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా కమర్షియల్ ప్రాపర్టీ అయ్యింది ఇప్పుడు..1980 లో దుకాణ సముదాయం నిర్మించారు. కాంగ్రెస్ పార్టీకి సొంతంగా జిల్లా ఆఫీసు...దాని నిర్వహణ ఖర్చులు పోను ఆదాయాన్ని సమకూర్చే కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది కాంగ్రెస్ పార్టీకి.. ఈ ప్రాపర్టీ విలువ కనీసం 40 కోట్ల పైమాటే.. ఇట్లా నగరం నడి బొడ్డులో సొంతంగా పార్టీ ఆఫీసు ఉన్నప్పటికీ.. ఇదే ఆఫీసు ఎదురుగా R&B స్థలంపై కాంగ్రెస్ పెద్దల కన్ను పడింది. గజం లక్షన్నర విలువ ఉన్న ఈ భూమి విలువ 50 నుంచి 60 కోట్లు ఉంది..4 లక్షల పైచిలుకు నామినల్ ధర చెల్లించి R&B శాఖకు చెందిన ఎకరం భూమిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి పొందింది. PCC చీఫ్ మహేష్ కుమార్ గ...

శాసన మండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రొఫెసర్ కోదండరాం

Image
హైదరాబాద్: శాసన మండలి సభ్యునిగా ప్రొఫెసర్ కోదండరాం గారు ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కోదండరాం గారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ గారు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, మంత్రులు శ్రీధర్ బాబు గారు, వివేక్ గారు, ఎంపీ వేమ నరేందర్ రెడ్డి గారు, ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టి.జే.ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. శాసన మండలి మీడియా పాయింట్ లో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ పదవులు అనేవి శాశ్వతం కావని అన్నారు. “ఒకాయన నేను పోరాడుతానా లేదా అని అన్నారు, నేను పోరాడి చూపిస్తా” అని స్పష్టం చేశారు. అనేక కేసులు, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తన పని ఆగలేదని, ముందుకే సాగుతుందని తెలిపారు. వివాదాస్పద సమస్యలకు పరిష్కారం లభించేలా కృషి చేస్తానని, స్పష్టమైన లక్ష్యాలను ఎంచుకొని పని చేస్తానని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యమకారుల సమస్యలు, ఆదివాసుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. ఇప్పటి వరకు చేస్తున్న ప్రజా సేవను...

బస్ స్టాండ్ జాగా కాంగ్రెస్ ఖాతాలో..

Image
నిజామాబాద్ నగరంలో ప్రజల అవసరాల కోసం ప్రతిపాదించిన ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం కేటాయించడాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా ప్రయోజనాలను పూర్తిగా పక్కనబెట్టి కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం అత్యంత విలువైన ప్రభుత్వ భూమినీ దుర్వినియోగం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతికి నిదర్శనమని అన్నారు. రాజకీయ పార్టీల కార్యాలయాలకు భూమిని కేటాయించడానికి BRS పార్టీ వ్యతిరేకం కాదు కానీ నగరంలోనే కోట్ల రూపాయల విలువైన మరియు ఇదివరకే ప్రజల అవసరాల కోసం ప్రతిపాదించినటువంటి భూమిని అప్పనంగా కొట్టేయ్యడానికి మేము వ్యతిరేకమన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నప్పుడు నిజామాబాద్ నగరంలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, ఆధునిక సదుపాయాలతో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం కోసం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న R &B స్థలాన్ని గుర్తించి ప్రతిపదించామని ,అలాగే బస్టాండ్ నిర్మాణము కోసం 20 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగాయని తెలిపారు....

బీఆర్ఎస్‌ను వీడను.. బీజేపీలో చేరను: జీవన్ రెడ్డి క్లారిటీ

Image
తాను బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలోకి మారుతున్నానని కొన్ని వార్తా సంస్థల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. తాను జీవితంలో ఎప్పుడూ బీ ఆర్ఎస్ ను వీడను, బీజేపీతో సహా మరే పార్టీలో చేరను అని ఆయన స్పష్టం చేశారు. రాజకీయంగా తనను ఎదుర్కొనే దమ్ము లేను కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఒక పథకం ప్రకారం సాగిస్తున్న కుట్రలో భాగమే తనపై ఈ దుష్ప్రచారం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కంఠంలో ప్రాణమున్నంత వరకూ కేసీఆర్ బాట వీడనని, చివరి వరకు గులాబీ నీడలోనే రాజకీయాలు చేస్తానని ఆయన అన్నారు. తాను రాజకీయ ఓనమాలు దిద్దుకున్న పార్టీ బీఆర్ఎస్ అని, తన రాజకీయ గురువు, ఆరాధ్య దైవం కేసీఆర్ అని జీవన్ రెడ్డి తెలిపారు. తాను బీజేపీలో చేరడానికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీని ఢిల్లీలో కలిసినట్టు కట్టుకథలు ప్రచారం చేసురున్నారని ఆయన మండిపడ్డారు. నిజానికి తాను ఏ కేంద్ర మంత్రిని కలవలేదని, తాను హైదరాబాద్ లోనే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి పేక్ ప్రచారాలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంట...

కుల గణన నివేదిక ఆధారంగా మాదిగలకు 10-11% రిజర్వేషన్లు ఇవ్వాలి : MRPS డిమాండ్

Image
© కుల గణన నివేదిక ప్రకారం మాదిగల జనాభా శాతానికి తగినట్టుగా 10 నుండి 11% రిజర్వేషన్లు కేటాయించాలి. © మంద కృష్ణ మాదిగ గారి మాటలు కుల గణన రిపోర్ట్ ద్వారా నిజమయ్యాయి. © ఆనాడు 9% రిజర్వేషన్ ను స్వాగతించిన వాళ్ళు జాతి ద్రోహులు. © అన్ని రకాల ప్రభుత్వ నియామకాల్లో 11% వాటా మాదిగలకు ఇవ్వాలి. © మహాత్మా ఫూలే ద్విశత జయంతి కమిటీలో మంద కృష్ణ మాదిగకు చోటు కల్పించినందుకు ప్రధానమంత్రికి కృతజ్ఞతలు. - ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ. వివరణ :- తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి ఉన్న ఏకైక కులం మాదిగలు మాత్రమే అని గత 12 సంవత్సరాలుగా మంద కృష్ణ మాదిగ చేస్తున్న ప్రకటన సత్యమని కుల గణన రిపోర్ట్ రుజువు చేసిందని, మా జనాభా 10% నుండి 11% ఉందని, ఎస్సీ వర్గీకరణలో కూడా మాకు అంతే వాటా కేటాయించాలని మంద కృష్ణ మాదిగ గతంలో లేవనెత్తిన ప్రశ్నలు సంపూర్ణ న్యాయమని కుల గణన రిపోర్ట్ తో స్పష్టం అయిందని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ అన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో MRPS ఆద్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో కనక ప్రమోద్ మాదిగ మాట్లాడుతూ " తెలంగాణ రాష్ట్ర ప...

ఘనంగా గణేష్ గుప్త జన్మదిన వేడుకలు

Image
నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల జన్మదిన వేడుకలు నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని నగర BRS పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి బాణా సంచా కాల్చి గణేష్ బిగాల జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గణేష్ బిగాల జన్మదినం సందర్భంగా ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని ఎల్లమ్మ గుట్ట కమాన్ వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించి, ప్రయాణికులకు మరియు స్థానిక ప్రజలకు చల్లని తాగునీరు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే కోటగల్లి లో చింతకాయల రాజు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా నిజామాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో నాయకులు, డివిజన్ ఇంచార్జులు, కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ గణేష్ బిగాల గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ నగర అధ్యక్షులు సిర్ప రాజ...

దద్దమ్మ తేజస్వి కి బుద్ధి లేదు.. -- మాజీ ఎంపీ మధు యాష్కీ

Image
60 ఏళ్ల తెలంగాణ పోరాటం గురించి తెలుసుకో.. తేజస్వి సూర్య..! తెలంగాణ గురించి, తెలంగాణ పోరాటం గురించి అవగాహన లేని దద్దమ్మ మాటలు మాట్లాడుతున్నావ్.. ఒకప్పుడు మీ కర్ణాటక ప్రాంతంని ప్రాంతాలు కూడా హైదరాబాద్ రాష్ట్రంలో భాగమే..! నిజాం పాలనలో ఉన్నవే.. తెలంగాణ చరిత్ర నీకు తెలవదు, మీ నరేంద్ర మోడీకి తెలవదు..! మీ తాత ముత్తాతల చరిత్ర ఏందో.. తెలుసుకొని మాట్లాడు తేజస్వి సూర్య..! బ్రిటిష్ కాలంలో ఇండియా - పాకిస్తాన్ విభజన ఎప్పుడు జరిగింది.? ఏపీ, తెలంగాణ విభజన ఎందుకు జరిగిందో..? అవగాహన లేకుండా రెండింటిని పోల్చుతూ మాట్లాడడం నీ తెలివి తక్కువ తనానికి నిదర్శనం. ఇలాంటి సిగ్గుమాలిన మాటలు మాట్లాడితే తెలంగాణలోనే కాదు.. నీ కర్ణాటకలోనూ నిన్ను చెప్పులతో కొడతారు..! అవకాశం వచ్చినప్పుడల్లా బిజెపి నేతలు తెలంగాణ పట్ల అక్కస్సును వెళ్లగాక్కుతున్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ.. ఏ చిన్న సంఘటన కూడా జరగకుండా కలిసిమెలిసి జీవనం సాగిస్తున్న తీరు బిజెపి పాలకులకు కంటగింపుగా కనపడుతుందా...? తెలంగాణ రాష్ట్ర ఎదుగుదల ఓర్వలేక పోతున్నారా..? బిజెపి ఎంపీ అలా అడ్డగోలుగా మాట్లాడుతున్నా తెలంగాణ రాష్ట్రం నుం...

తెలంగాణ ప్రజలపై విషం చిమ్మిన భాజపా ఎంపీ తేజస్వి సూర్య

Image
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జీర్ణించుకోలేని భాజపా బెంగుళూరు ఎంపీ తేజస్వి సూర్య విషం చిమ్మడం తెలంగాణ ఆస్తిత్వంపై దాడిగా నిజామాబాద్ భారాస లీగల్ సెల్ కన్వీనర్ దాదన్నగారి మధుసుధన్ రావు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాస్ట్రాన్ని విభజించడాన్ని దేశ విభజనతో పోల్చడం అతని అజ్ఞానానికి పరాకాష్టగా అభివర్ణించారు. కేసీఆర్ మలిదశ ఉద్యమంతో సకల జనులు కలిసి వచ్చిన చారిత్రాత్మక పోరాటాన్ని కించపరచడమేనని తెలిపారు. తెలంగాణ ప్రజలను అవమానించిన భాజపా ఎంపీ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.ఆంధ్ర ఆధిపత్య శక్తుల తొత్తుగా మారిన తేజస్వి సూర్యను తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన పేర్కొన్నారు.తెలంగాణ ఆత్మగౌరవంపై, తెలంగాణ ఆస్తిత్వంపై భాజపా ఎంపీ విషపు గుళికలు విసిరి వేయడం సూర్యలో ఉన్న కపటత్వానికి నిదర్శనమని మధుసుధన్ రావు అన్నారు. సూర్య తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పి, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel

నిజామాబాద్‌లో అన్నా బాహు సాఠే విగ్రహావిష్కరణ.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ఘన స్వాగతం

Image
నిజామాబాద్ నగర పర్యటనకు ఆదివారం సాయంత్రం విచ్చేసిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. చంద్రశేఖర్ కాలనీలో నూతనంగా నెలకొల్పిన అన్నా బాహు సాఠే విగ్రహాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇంచార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. మంత్రి వెంట ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, నగర మేయర్ ఉమారాణి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు. మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel

అన్నా నన్ను దేవుడే పంపిండు.. -జీవన్ రెడ్డి భావోద్వేగం

Image
ఎర్రవల్లి, కేసీఆర్ ను కలిసిన సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు ఆయనను కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావుతో ఎర్రవెల్లి నివాసంలో, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి శుక్రవారం నాడు మర్యాదపూర్వక భేటీ అయ్యారు. నివాసానికి చేరుకున్న జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్. రమణ, ఎమ్మెల్యే డా. కె. సంజయ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కె. విద్యాసాగర్ రావు, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు. జీవన్ రెడ్డి గారితో పాటు వచ్చిన వారిలో వారి కుమారులు, జగిత్యాల మాజీ జడ్పీ చైర్ పర్సన్ వసంత సురేశ్ దంపతులు తదితరులు ఉన్నారు. నిరంతరం తన నియోజకవర్గం, జిల్లా ప్రజలు, రైతుల గురించి ఆలోచన చేసే...

టైగర్ నరేంద్ర 12వ వర్ధంతి – బీజేపీ నేతల ఘన నివాళులు

Image
నిజామాబాద్, హిందుత్వమే ఊపిరిగా, కాషాయమే ప్రాణంగా, పాతబస్తీ అరాచక శక్తుల పాలిట సింహస్వప్నమైన మన తెలంగాణ ముద్దుబిడ్డ స్వర్గీయ టైగర్ నరేంద్ర.. అయోధ్య ఉద్యమంలో కరసేవకులకు నాయకత్వం వహించి లాఠీ దెబ్బలు తిన్న చరిత్ర . భారతీయ జనసంఘ్ ఇందూరు జిల్లా ప్రచారక్గా పని చేశారు. మహనీయులు ఎంతో మంది కార్యకర్తలను జాతీయవాదం కోసం, ఈదేశం కోసం, ధర్మం కోసం నిర్మాణం చేసిన టైగర్ అలె నరేంద్ర భాయ్ సాబ్ 12 వర్ధంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు స్వామి యాదవ్, ఓబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధమల ఆనంద్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి పర్సని వెంకటేష్ గారితో కలిసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఒబిసి మోర్చా ఐటీ సెల్ కన్వీనర్ రాజ్ కుమార్ , కరుణ్ తోపాటు ఓబిసి మోర్చా నాయకులు పాల్గొన్నారు మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel

నిజామాబాద్ కాంగ్రెస్ కార్యాలయంలో రచ్చ – నేతల మధ్య వాగ్వాదం, సస్పెన్షన్లు

Image
కాంగ్రెస్​ పార్టీ నిజామాబాద్​ జిల్లా కార్యాలయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. డీసీసీ అధ్యక్షుడు నగేశ్​రెడ్డి, ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్​ మధ్య రచ్చ రచ్చ జరిగింది. కాంగ్రెస్​ పార్టీ నిజామాబాద్​ జిల్లా కార్యాలయంలో నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. డీసీసీ అధ్యక్షుడు నగేశ్​రెడ్డి, ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్​ మధ్య కొట్లాట జరిగింది. రాష్ట్ర కో ఆపరేటివ్ యూనియన్​​ ఛైర్మన్​, డీసీసీ మాజీ అధ్యక్షుడు మానాల మోహన్​రెడ్డి పుట్టిన రోజు వేడుకలను బుధవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. వేణురాజ్​ ఆధ్వర్యంలో కార్యకర్తలు కేక్ చేయడానికి అంతా సిద్ధం చేశారు. ఇంతలోనే అయితే వారిని జిల్లా అధ్యక్షుడు నగేశ్​రెడ్డి, బర్త్డే వేడుకలను నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. జిల్లా అధ్యక్షుడికి, వేణురాజ్​కు మధ్య మాటల యుద్ధం నడిచింది. ఒకరిపై ఒకరు విచక్షణ మరిచి ఒక ప్రజా ప్రతినిధులం అని కూడా మర్చిపోయి ఓ స్థాయిలో ఒకరిని ఒకరు కాలర్లు పట్టుకొని కొట్టుకొనే వరకు ఘటన వెళ్ళింది. అయితే మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డికి ప్రస...

నిజామాబాద్‌లో కిసాన్ న్యాయ్ సత్యాగ్రహం – కాంగ్రెస్ నేతల పిలుపు

Image
నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం కిసాన్ న్యాయ్ సత్యాగ్రహ కార్యక్రమం జరిగింది.ముఖ్య అతిథిగా పాల్గొన్న నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఊర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్ , రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీ సభ్యులు రామకృష్ణ , నగర మేయర్ ఉమారాణి , నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ , నూడా చైర్మన్ కేశ వేణు ,జిల్లా కాంగ్రెస్ పార్టీ కోశాధికారి భక్తవత్సలం , జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శరత్ , గాదారి గోపి జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గౌడ్ ,కార్పొరేటర్లు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel

BJP కార్పొరేటర్ వసూళ్లపై పోరాటం

Image
నిజామాబాద్, ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ మఠం పవన్ రాజకీయ కక్ష సాధింపుతో ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అసోసియేషన్ పై పుకార్లు పుట్టిస్తూ జిల్లా కలెక్టర్ ,మున్సిపల్ కమిషనర్ లకి ఫిర్యాదు చేయడం అత్యంత హేయమైన చర్య అని ఆర్ ఆర్ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.... మున్సిపల్ ఎన్నికలలో గెలుపొందిన నిజామాబాద్ సౌత్ డివిజన్ల కార్పొరేటర్లకు సన్మానం చేయాలని సదుద్దేశంతో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ భవనము మరమ్మత్తులు జరుగుతుండడం వలన స్థానికంగా ఉన్న వాటర్ ప్లాంట్ లో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వాటర్ ప్లాంట్ ను డాక్టర్ గ్రూప్ వారు 15 సంవత్సరములు అద్దెకు తీసుకున్నారని , ఇంకా ఏడు సంవత్సరాల కాల పరిమితి మిగిలి ఉందన్నారు. తాము అనుమతితో సన్మాన కార్యక్రమం నిర్వహించామని, సన్మాన కార్యక్రమంలో మఠం పవన్ ని కూడా సన్మానించామన్నారు. కానీ తాను రాజకీయ బురద చల్లడం కోసం వాటర్ ప్లాంట్ ను కబ్జా చేసేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కార్పొరేటర్ గా ఎ...