Posts

Showing posts with the label Telangana News

తెలంగాణ జన సమితిలో చేరిన బాస రమేష్ యాదవ్.. కోదండరాం సమక్షంలో పార్టీలోకి ఆహ్వానం

Image
తెలంగాణ జన సమితిలో బాస రమేష్ యాదవ్ ............ హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు బాస రమేష్ యాదవ్ ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ జన సమితి పార్టీలో చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు బాల్కొండ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కూడా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బాస రమేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రొఫెసర్ కోదండరాం గారి నాయకత్వంలో పనిచేయడం గర్వంగా భావిస్తున్నానన్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన, తెలంగాణ పునర్నిర్మాణం కోదండరాం గారి నాయకత్వంలోనే సాధ్యమనే నమ్మకంతో టి.జే.ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ విలువలతో కూడిన రాజకీయం, ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం తెలంగాణ జన సమితి ప్రధాన లక్ష్యాలని తెలిపారు. ప్రస్తుతం డబ్బు కేంద్రంగా సాగుతున్న రాజకీయాల మధ్య ప్రజల ఆకాంక్షలనే అజెండాగా చేసుకుని టి.జే.ఎస్ పనిచేస్తోందన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ జన...

ట్రాన్స్ జెండర్ల బహిష్కరణ.. ఇందూరు గడ్డపై VDCల ఆగడాలు

Image
నగరంలోని కలెక్టరేట్​ ఎదుట ట్రాన్స్​జెండర్లు ధర్నాకు దిగారు. తమను గ్రామాల్లోకి రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రజావాణి లో అధికారులకు ఫిర్యాదు చేశారు. ట్రాన్స్​జెండర్స్ సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఓరుగంటి గంగ, జరీనా బేగం మాట్లాడుతూ.. గ్రామాల్లోకి ట్రాన్స్​జెండర్లు వీడీసీలు ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నాయని ఆరోపించారు. ఇటీవల సిరికొండ మండలం మైలారం గ్రామంలో చిన్న పిల్లల్ని అపహరిస్తున్నారంటూ భౌతికదారులకు దిగారన్నారు. అలాగే నందిపేట మండలం హుస్నాపూర్​లో హిజ్రాలను గ్రామపంచాయతీలో అక్రమంగా నిర్బంధించారని పేర్కొన్నారు. మోపాల్ మండలంలో హిజ్రాలు రావొద్దంటూ పోస్టర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్నారు. తమను పూర్తిగా సామాజిక బహిష్కరణ చేయడం ఎంతవరకు సబబని ట్రాన్స్​జెండర్లు ప్రశ్నించారు. ఎక్కడైనా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరిగితే వెళ్లి వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వారి జీవితం, వారి వ్యాపార లావాదేవాలు సుభిక్షంగా ఉండాలని తాము నిండు మనసుతో ఆశీర్వదిస్తామే తప్ప తమలో ఎలాంటి కల్మషం ఉండదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారు ఇచ్చినంత తీసుకొని వస్తామని.. అలాంటి తమపై దుష్ప్రచారం చేయ...

నిజామాబాద్ ట్రాఫిక్ కష్టాలకు చెక్: ఆ రెండు ‘ఫ్లైఓవర్లు’ నిర్మిస్తేనే నగరానికి మహర్దశ!

Image
కొండలు, గుట్టలు, పచ్చిక బయళ్లతో అలరారుతున్న మన నిజామాబాద్ జిల్లా ప్రకృతి సౌందర్యానికి కేరాఫ్ అడ్రస్. ఇక్కడి మనుషుల ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు వెలకట్టలేనివి. కష్టనష్టాల్లో ఒకరికొకరు తోడుగా నిలుస్తూ, ఆదర్శవంతమైన జీవనశైలితో ముందుకు సాగుతున్న మన నగరం గర్వించదగ్గ ఎన్నో విశేషాలకు నిలయం. అయితే, ఇంతటి అందమైన మన నగరానికి ఇప్పుడు ఒక పెద్ద సమస్య సవాలుగా మారింది. అదే ట్రాఫిక్ కష్టాలు. స్తంభిస్తున్న నగరం.. ఇబ్బందుల్లో జనం! జిల్లా కేంద్రంలో రోజురోజుకూ వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వేలాది కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు, బస్సులు, భారీ లారీలు.. ఇలా ఒకటేమిటి, ప్రతి రోజూ వేల సంఖ్యలో వాహనాలు నగర వీధుల్లో రాకపోకలు సాగిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ గంటల తరబడి స్తంభించిపోతుండటంతో సామాన్య ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిష్కారం ఒక్కటే: రెండు కీలక ఫ్లైఓవర్ల నిర్మాణం నగరంలో నెలకొన్న ఈ ట్రాఫిక్ జటిల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ సమస్యకు ప్రధానంగా రెండే రెండు పరిష్కార మార్గాలు ఉన్నాయని నిపుణులు మరియు స్థానికులు అ...

హిందువుల ఐక్యత కోసమే ఆర్‌ఎస్‌ఎస్ స్థాపన : కందకుర్తిలో మోహన్ భగవత్

Image
దేశంలో ఉన్న హిందువులను ఐక్యం చేయడానికే హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ను ఏర్పాటు చేశారని ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. రెంజల్ మండలంలోని మండలంలోని కందకుర్తి లోని కేశవ స్ఫూర్తి మందిరాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ శనివారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెడ్గేవార్ జననం, మరణం నాగ్పూర్లోనే జరిగిందన్నారు. అయితే ఆయన పూర్వికులు కందకుర్తికి చెందిన వారని చెప్పారు. దీంతో ఇక్కడ స్ఫూర్తి కేంద్రం నిర్మించాలని సంకల్పించామన్నారు. కందకుర్తి ప్రాశస్త్యం తనకు ఈ రోజు ఓ డాక్యుమెంటరీ వీడియో ద్వారా పూర్తిగా తెలిసిందన్నారు. హిందూ సమాజాన్ని జాగృతం చేయడానికి.. గరుడ్మంతుడు స్వర్గానికి వెళ్లి అమృతం తెచ్చి తన తల్లిని బానిసత్వం నుంచి విముక్తి చేశారని మోహన్ భగవత్ తెలిపారు. అనంతరం ఆ అమృతాన్ని తిరిగి తీసుకెళ్లి ఇంద్రుడికి ఇచ్చారని చెప్పారు. తన కోసం అమృతం తేలేదని, తల్లిని బానిసత్వం నుంచి విడిపించాడనికి తెచ్చాడని చెప్పారు. హెడ్గేవార్ సైతం తల్లి భారతమాతను దాస్య శృంఖాలల నుంచి విడిపించడానికి ఆర్ఎస్ఎస్ను ఏర్పాటు చేశారన్నారు. బ్రిటిష్ వాళ్లకంటే ముందు ఎంతో మందిని విదేశీయులు ...

ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు

Image
మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దుబ్బ లోని మున్నూరు కాపు కల్యాణ మండపంలో పూలే జయంతి వేడుక నిర్వహించారు. అంతకుముందు వినాయకనగర్ లోని మహాత్మ జ్యోతిబా పూలే విగ్రహానికి అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగర మేయర్ కే.ఉమారాణి, ఇంచార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, బీసీ సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, అనేక ఆంక్షలతో కూడిన నాటి సమాజంలో నెలకొని ఉన్న రుగ్మతలను పారద్రోలేందుకు మహాత్మ జ్యోతిబాపూలే కొనసాగించిన కృషి అమోఘమని అన్నారు. అడుగడుగునా అవరోధాలు, అవమానాలు ఎదురైనప్పటికీ ఏమాత్రం చలించకుండా సాంఘిక దురాచారాలను దూరం చేసేందుకు పూలే ఎంతగానో శ్రమించారని గుర్తు చేశారు. అణగారిన వర్గాలు సమానత్వం సాధించాలంటే విద్య ఎంతో అవసరమని గుర్తించి వారికి విద్య అందేలా విశేషంగా కృషి చేశారని, మహిళల విద్య కోసం ప్రత్యేకంగా మొట్టమొదటి పాఠశాలను స్థాపింపజేశారని అన్నారు. ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ప్రభుత్వం బీ.సీ గురుకులాలకు జ...

కందకుర్తికి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రాక.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు

Image
నిజామాబాద్, ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ నెల 11న నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి పర్యటనకు హాజరు కానున్న నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా అధికారులతో కలిసి ఆయన పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. కందకుర్తిలో కొనసాగుతున్న తుది ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్, అధికారులకు సూచనలు చేశారు. మోహన్ భగవత్ పర్యటనలో భద్రతా పరంగా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బహిరంగ సభకు వచ్చే వారు వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు ఎంపిక చేసిన స్థలంలో ఏర్పాట్లు, సభా ప్రాంగణం, బారికేడ్లు తదితర వాటిని కలెక్టర్ పరిశీలించారు. ఆర్ ఎస్ ఎస్ చీఫ్ భద్రతకు పకడ్బందీ బందోబస్తును ఏర్పాటు చేయాలని, ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. సభా స్థలి వద్ద అన్ని వసతులతో కూడిన అంబులెన్స్, అగ్నిమాపక శకటం, వైద్య బృందం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఏసీపీ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రవణ్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. మ...

నిజామాబాద్ సెంట్రల్ జైలులో ఖైదీలకు ఎయిడ్స్, టిబి పరీక్షలు

Image
నిజామాబాద్, ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ రోజు సెంట్రల్ జైలు లో దాదాపు 640 మంది ఖైదీలకు HIV/syphilis/hepatitis B &C &TB పరీక్షలు నిర్వహించారు.,అలాగే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి డాక్టర్ల సహకారంతో కంటి పరీక్షలు, స్కిన్ ,డెంటల్ , గైనిక్ ,గుండెకు సంబంధించిన పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యా ఆరోగ్య అధికారి డాక్టర్ బి రాజశ్రీ, జిల్లా టిబి నియంత్రణ అధికారి & పోగ్రామ్ ఆఫీసర్ ఎయిడ్స్ అండ్ లెప్రసీ డాక్టర్ దేవి నాగేశ్వరి, NVHCP నోడల్ ఆఫీసర్ డాక్టర్ వెంకటేష్ , మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సామ్రాట్ యాదవ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అవంతి, డి హెచ్ ఈ ఘన్ పూర్ వెంకటేశ్వర్ , ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సిబ్బంది, జిల్లా టిబి నియంత్రణ సిబ్బంది పాల్గొన్నారు. మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel

కల్తీ పెట్రోల్ టెస్ట్ పేపర్లు ఇవ్వరిక్కడ...

Image
మాయ చేసి మత్మరించడంలో ఘనాపాటీలు ఇందూరు పెట్రోల్ బంక్ యజమానులు.. పెట్రోల్ క్వాలిటీ నిర్దారణ కోసం వినియోగ దారులకు ఉన్న చట్టబద్ధమైన హక్కును బాజాప్తాగా కాలరాస్తున్నారు. ప్రతి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ నాణ్యత తాలూకు పరీక్ష కోసం వినియోగదారులకు ప్రీ పెట్రోల్ క్వాలిటీ టెస్టు పేపరును అందుబాటులో ఉంచాలి. ఈ విషయం వినియోగదారులకు తెలిసిన దాఖలాలు లేవు. ఒకరిద్దరు వినియోగదారులకు తెలిసి క్వాలిటీ టెస్టు పేపర్ అడిగినా ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు పెట్రోల్ బంక్ యజమానులు.. అచ్చంగా అలాంటి చేదు అనుభవం మన నిజామాబాద్ టీమ్ కు ఎదురైంది. నిజామాబాద్ నగరంలోని వంశీ హోటల్ ఎదురుగా ఉన్న ఇండియన్ ఆయిల్ బంక్ లో పెట్రోల్ టెస్టు పేపర్ అడిగితే తిక్క తిక్కగా వ్యవహరించారు . టెస్టు పేపర్ ఉండదని ఒకసారి.. వినియోగదారులకు ఇచ్చేది కాదని బుకాయించాడు బంక్ ఇంచార్జ్.టెస్ట్ పేపర్ అడిగితే వివ్వవల్సిందే అని DSO చెప్పారని అన్న వెంటనే.. అయితే DSO నే అడగండని తిక్క సమాధానం ఇచ్చారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం 1986 ప్రకారం టెస్టు పేపర్ ఇవ్వాల్సిందే అని మన నిజామాబాద్ పట్టుబట్టగా చేసేది ఏమిలేక అయిష్టంగా పేపర్ ను చేతిలో పెట్టారు ...

దేవీప్రసాద్ సార్... ఒక చిరునవ్వుల సంతకం! – దేశపతి శ్రీనివాస్ భావోద్వేగ రచన

Image
వాల్మీకి రామాయణంలో రాముణ్ణి 'స్మితపూర్వాభిభాషి' అంటడు. అంటే, మాట్లాడకముందే ఒక చిరునవ్వు విసిరేవాడని అర్థం. దేవీ ప్రసాద్ సార్ ని చూస్తుంటే నాకు సరిగ్గ ఇదే మాట గుర్తొస్తుంది. ఎదుటి మనిషిని నొప్పించకుండ, టైమింగ్ మిస్ కాకుండ మాట్లాడటం... అసలు ఎవరి గురించీ చెడ్డగ అనకపోవడం... ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే వచ్చేటివి కావు, అది ఒక 'నేచర్'. ఆ క్వాలిటీసే ఆయన్ని ఒక స్పెషల్ లీడర్‌గా నిలబెట్టాయి. నేను డిగ్రీ చదివే రోజుల్లో 'మరసం' పనుల మీద సిధారెడ్డి సార్ తోని కలిసి మెదక్ కు పోయినప్పుడు మొట్టమొదటిసారి దేవీప్రసాద్ సార్ 'ఆత్మీయ స్పర్శ'కు గురయ్యాను. అప్పటినుండి ఇప్పటిదాకా ఆ ఆత్మీయ అనుబంధ స్పర్శ అంతే తడిగా అట్లనే ఉంది. ఇగ లక్ష్మక్క గురించి చెప్పాలె... ఇంటికి వచ్చే బుద్ధిజీవులు, కవులు, ఉద్యమకారుల పాలిట ఆమె నిజంగా 'అన్నపూర్ణ'. అక్క చేతి వంట రుచి చూసిన వాళ్లెవరూ మర్చిపోలేరు. దేవీప్రసాద్ సార్ సహచరిగా ఆమె ఎన్నో కష్టనష్టాలను ఓపిగ్గా భరించింది తప్ప, ఎప్పుడూ కొంచెం కూడా యాష్ట పడలేదు. సిధారెడ్డి గారితో ఉన్న ఆత్మీయ స్నేహంతో మెదక్ స్టడీ సర్కిల్, మంజీరా రచయితల సంఘం స్...

ఐ డి ఓ సి ఉద్యోగులకు జీవనశైలి వ్యాధుల నిర్ధారణ పరీక్షలు

Image
నిజామాబాద్, ఈరోజు ఐడిఓసి ఉద్యోగులకు జీవన శైలి వ్యాధుల నిర్ధారణ పరీక్షల రెండు రోజుల ఆరోగ్య శిబిరాలను కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాటి ప్రారంభించారు.. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐడి ఓసి లో ఉన్న అన్ని శాఖల ఉద్యోగులు సుమారు 800 అందరూ జీవనశైలి వ్యాధులైన హైపర్ టెన్షన్, గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ మొదలగు వ్యాధులకై నిర్ధారణ పరీక్షలను ఆరవ తేదీ,ఏడవ తేదీ రెండు రోజులు ఉదయం 10 గంటలనుండి సాయంత్రం వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు.అందరు తప్పకుండా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని తెలియజేశారు. ప్రతి ఉద్యోగి తన జీవన శైలిలో మార్పులను చేసుకుంటూ గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ లాంటి వ్యాధులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్యం పై హెల్త్ వీక్ నిర్వహించడం జరుగుతుందని దానిలో భాగంగా ఈరోజు ఆరోగ్య భద్రతపై అవగాహన దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు.దీనికోసం చక్కని పోషకాహారం, సిరి ధాన్యాలు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను మాత్రమే వాడాలి అన్నారు .ఈ సందర్భంగా ఉద్యోగుల కోసం సిరి ధాన్యాలు, గానుగ నూనెలతో కూడిన మిల్లెట్ మేళాను కూడా నిర్వహించా...

నిజామాబాద్‌లో అక్రమంగా గోవుల తరలింపు అడ్డుకున్న స్థానికులు

Image
అక్రమంగా మినీ టాక్సీలో గోవులను పెట్టుకొని ఆర్మూర్ రోడ్డు నుండి నిజామాబాద్ నగరంలోకి వెళ్తున్న ఆ వాహనాన్ని నిజామాబాద్ నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరామ గార్డెన్ సమీపంలో స్థానికులు అక్రమంగా తరలిస్తున్న గోమాతల వాహనాన్ని స్థానికులు అడ్డుకున్నారు. దీంతో స్థానికులు వెంటనే రూరల్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాస్ తన బృందంతో ఘటన స్థలానికి చేరుకుని ఆ వాహనం ఎక్కడినుండి వచ్చింది, ఎక్కడకు వెళ్తుంది అనే వివరాలు, అసలు ఈ గోవులను అక్రమంగా తరలిస్తున్న వారెవరు అనే వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని సిఐ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆ తర్వాత గోవులను మల్లారం గోశాలకు తరలించినట్లు రూరల్ సీఐ ఫోన్ ద్వారా సమాచారం మన నిజామాబాద్ ఛానల్ కు అందించారు. అయితే గో అక్రమ లో ప్రధాన పాత్ర వహించిన నిందితులను తమ దర్యాప్తులో తేలిన తర్వాత కేసు నమోదు చేస్తామని ఆయన పేర్కొన్నారు. మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp ...

నిజామాబాద్‌లో ఘనంగా బాబూ జగ్జీవన్ రాం 119వ జయంతి వేడుకలు

Image
నిజామాబాద్, భారత మాజీ ఉపప్రదాని డాక్టర్ బాబు జగ్జీవన్ రాం 119వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కంటేశ్వర్ కమాన్ వద్ద గల పాత అంబేడ్కర్ భవన్ లో నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో అర్బన్ శాసన సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగర మేయర్ కే.ఉమారాణి, రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్ తదితరులు బాబూ జగ్జీవన్ రాం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాత అంబేడ్కర్ భవన్ ఆవరణలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో పాల్గొని బాబు జగ్జీవన్ రాం చేసిన సేవలను కొనియాడారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, బాబూ జగ్జీవన్ రాం ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రత్యేకించి యువతరం, విద్యార్థుల్లో స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ భవిష్యత్తు కోసం, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు జగ్జీవన్ రాం అందించిన సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శమని అన్నారు. మహనీయుల గొప్...

భూగర్భానికి రీఛార్జ్... నెలకో మీటర్ లోతుకు జలమట్టాలు... ఆదా చెయ్యకపోతే అదొగతే...!

Image
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. తద్వారా భూగర్భ జలాలు ఆవిరి అధికమవుతున్నాయి. దీనికి తోడు లక్షలాది వ్యవసాయ బోరు బావులు పంటల నిమిత్తం నీటిని పొలాల్లోకి సాగునీరుగా వాడుకుంటున్నారు రైతులు. ఇక గృహ అవసరాల నిమిత్తం ఏర్పాటు చేసుకునే బోర్లు కోట్ల లీటర్ల నీటిని లాగేస్తున్నాయని భూగర్భ జల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ బాబు పేర్కొన్నారు. ప్రాజెక్టులు జలాశయాల్లోని నీటిని త్రాగునీటి కోసం సాగు అవసరాల కోసం వాడుతూనే ఉన్నాం అయితే వర్షాలు కురిసే శాతం తగ్గిపోవడంతో భూగర్భ రీఛార్జ్ కావడం లేదని, జలవినియోగంపై ఇంకుడు గుంటల కై వాటి ఏర్పాటు చేయడం వాటిపై దృష్టి సారించడం లేదన్నారు.దీంతో నెలకు మీటర్ లోతున నీరు ఖాళీ అవుతుంది ఈ మేరకు భవిష్యత్తులో త్రాగునీరు, సాగునీటి లభ్యత ప్రశ్నార్థకమవుతుంది. ఈ అంశంపై జిల్లా భూగర్భ జల శాఖ అధికారి శ్రీనివాస్ బాబు మన నిజామాబాద్ ఛానల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. వారు ఏమంటున్నారు వారి మాటల్లోనే విందాం.. మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Cha...

కలెక్టరేట్‌లో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

Image
నిజామాబాద్, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లోని ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి, దొడ్డి కొమురయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, దొడ్డి కొమురయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రభావశీలిగా నిలిచారని కొనియాడారు. ఆనాటి దేశముఖ్ ల అసంబద్ధ పాలనకు వ్యతిరేకంగా అత్యంత ధైర్య సాహసాలతో పోరాటం జరిపారని గుర్తు చేశారు. కొమురయ్య పోరాట స్ఫూర్తితో తెలంగాణాలో అనేక ప్రజాస్వామిక ఉద్యమాలు జరిగాయని, ఈ ఉద్యమాలకు దొడ్డి కొమురయ్య పోరు పటిమ ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. మహనీయుల కృషిని స్మరించుకునేందుకు, నేటి తరం వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలనే ఆకాంక్షతో ప్రభుత్వం మహనీయుల జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందని అన్నారు. మహనీయులు చూపిన బాటలో నడుస్తూ, అణగారిన వర్గాల అభ్యున...

తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగంలో న్యాయవాదులు..

Image
హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ విద్యార్థుల ఆధ్వర్యంలో గురువారం రాత్రి జరిగిన "DUCIMUS - WE LEAD" ముగింపు కార్యక్రమంలో అసెంబ్లీలో BRS పక్ష ఉప నేత హరీష్ రావు పాల్గొన్నారు.గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన చేసిన ప్రసంగం విద్యార్థులను అర్రుత లూగించారు. ఈ సందర్భంగా హరీష్ రావు ప్రసంగం ఆయన మాటల్లోనే... "ఉస్మానియా యూనివర్సిటీలోకి వస్తుంటే ఎన్నో పాత జ్ఞాపకాలు, ఉద్వేగభరిత సంఘటనలు గుర్తొస్తున్నాయి . లా పూర్తి చేసుకొని నల్ల సూట్ వేసుకొని బీఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ పరిరక్షకులుగా మారబోతున్న మీ అందరికి అభినందనలు. యువత అంటే సాఫ్ట్వేర్, డాక్టర్ వైపే మక్కువ చూపుతున్న ఈ రోజుల్లో మీరు లా చదవడం అంటే మీరు something special. ఈ దేశంలో జరిగిన అనేక ఉద్యమాల్లో, ఆఖరికి తెలంగాణ ఉద్యమంలో కూడా న్యాయవాదులే అగ్రభాగంలో ఉన్నారు. మహాత్మ గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, అంబేద్కర్ ఇలా స్వాతంత్ర్య పోరాటంలో ముందున్నది న్యాయవాదులే. సాగర హారం, మిలియన్ మార్చ్, రహదారుల దిగ్బంధం, ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఉద్యమానికి అండగా నిలబడ్డది న్యాయవాదులే. ఎక్కడై...

హనుమాన్ శోభా యాత్రలో బిగాల గణేష్ సేవ..

Image
📍 నిజామాబాద్, హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా నిజామాబాద్ నగరంలో భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించిన శోభాయాత్రలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమాన్ స్వామి విగ్రహ రథం వద్ద గణేష్ బిగాల పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు. నగరం మొత్తం భక్తి పారవశ్యంతో నిండిపోగా, “జై శ్రీరాం”, “జై హనుమాన్” నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణం అలరించింది. అనంతరం నిజామాబాద్ అర్బన్ BRS పార్టీ ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ, పండ్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులతో ఆప్యాయంగా మమేకమై, వారికి అభివాదం చేస్తూ శోభాయాత్రలో కలిసి నడిచారు.ఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ హనుమాన్ స్వామి భక్తి, బలం, ధైర్యానికి ప్రతీక అని, స్వామివారి కృపతో ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ప్రతి ఇంటిలో ఆనందం, ఐశ్వర్యం నిండాలని ప్రార్థించారు. మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel

అభివృద్ధికి కేరాఫ్ కాంగ్రెస్ -దోమకొండలో షబ్బీర్ అలీ

Image
కామారెడ్డి , దోమకొండలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభలో ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక గురించి షబ్బీర్ అలీ వివరంగా ప్రజలకు తెలియజేశారు. ఈ ప్రణాళిక ద్వారా గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ఆరోగ్య సేవల మెరుగుదల, రహదారుల నిర్మాణం వంటి పలు రంగాల్లో వేగంగా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. మండల అభివృద్ధిలో భాగంగా రూ.75 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు మరియు ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఈ పనులు పూర్తయితే దోమకొండలో మౌలిక వసతులు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు. గ్రామసభలో భాగంగా గ్రామస్తులు పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేయగా, కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, 99 రోజుల ప్రణాళిక ద్వారా ప్రతి గ్రామంలో అభివృద్ధి ఫలితాలు కనిపిస్తాయని అన్నారు. దోమకొండ మండల...

VDC ఆగడాలకు అడ్డుకట్ట.. దళితులు రాజీపడొద్దు: ఎస్సీ-ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్కి వెంకటయ్య

Image
నిజామాబాద్ జిల్లాలో గ్రామ అభివృద్ధి కమిటీ లు ఆయా గ్రామాల్లో విధించే సాంఘిక బహిష్కరణలకు అడ్డుకట్ట వేస్తామని, ఇందులో దళితులు రాజీ పడాల్సిన అవసరం లేదని, దీనికై త్వరలోనే మరిన్ని కఠినమైన చట్టాల అమలుకు శ్రీకారం చుడతామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్కి వెంకటయ్య ఉద్గటించారు. బుధవారం జిల్లా కేంద్రానికి తన వ్యక్తిగత పనులపై వచ్చిన చైర్మన్ మన నిజామాబాద్ ఛానల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయా జిల్లాలో కలెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారులు నివేదికల సహకారంతో జూన్ మాసంలో డీజీపీ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. దీని ద్వారా దళిత గిరిజనులకు దేవాలయాల ప్రవేశ నిషేధం, పరువు హత్యలు, లాంటివి జరగకుండా ఉండేందుకు ఈ సమావేశం నిర్వహించ తలపెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. రోస్టర్ పాయింట్ల లో ఉన్న లోపాల గుర్తింపు వాటి సవరణలు లాంటి అనేక అంశాల్లో ఉన్న సంస్కరణలతో మన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ న్ని దేశానికి రోల్ మోడల్ గా నిలబెడతానని ఆయన అభిప్రాయపడ్డారు ఈ మేరకు ఇప్పటికే ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ చైర్మన్లు సభ్యులతో చర్చలు సంప్రదింపులు జరిపామన్నారు. న్యాయశా...

నిజామాబాద్‌లో బలవంతపు పన్ను వసూళ్లు? ఇంట్లో ఫ్రిజ్ జప్తు !

Image
నిజామాబాద్ ప్రజలు ఇంకా నిజాం నవాబు పాలనలో ఉన్నామా అంటూ ముక్కున వేలు వేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది.. నిజాం నిరంకుశ పాలనలో పన్నుల వసూలు కర్కశంగా ఉండేది.. రజాకార్లను రంగంలోకి దింపి పన్నులు కట్టమని.. ఇంట్లో కనపడిన వస్తువులను ఎత్తుకుని పోయేవారు.. తెలంగాణ రాష్ట్రం సిద్దించక ముందు TDP, కాంగ్రెస్ హయాంలోనూ నిజాం కాలంనాటి జప్తులు కొనసాగేవి..పన్నులు కట్టడం లేదంటూ ఇరుగుపొరుగు వారిని పిలిచి ఇజ్జత్ తీసి ఇంటి దర్వాజలు,కిటికీలు పీక్కపోయి పరువు తీసేవారు అంజువాన్ అధికారులు..అంటే సహకార శాఖ వసూల్ సిబ్బంది.. 13 ఏళ్లలో ఇలాంటి బూజు పట్టిన నవాబు కాలంనాటి బలవంతపు పన్నుల వసూళ్ళు జరుగలేవు.. ఘనత వహించిన నిజామాబాద్ బల్దియా మాత్రం నిజాం తరహా పన్ను వసూళ్లకు బరితెగించారు. శ్రీరామ నవమి పండుగరోజే మిడుతలు దండు వలే నిజామాబాద్ నగరం ఎల్లమ్మ గుట్ట ప్రాంతంలోని విజయ్ టాకీస్ వెనకాల అనౌన్స్ మెంట్ వెహికిల్స్ తో ఎంటరయ్యారు.. నవీన్ అనే మధ్య తరగతి ఇంట్లోకి దూరి ఇంట్లోని వస్తువులను జప్తు చేసేందుకు హడావిడి చేశారు మున్సిపల్ కార్పోరేషన్ ఉద్యోగులు..18000 ఇంటి పన్ను ఇప్పటికిప్పుడు కట్టితీర వల్సిందే అంటూ హుకుం జారీచేశారు....

మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం.. సమిష్టి కృషికి కలెక్టర్, సీపీ పిలుపు

Image
నిజామాబాద్, మాదకద్రవ్యాల నిరోధానికి సమిష్టి కృషి జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్, సీపీ వెల్లడి మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగంపై గట్టి నిఘా కొనసాగించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన మత్తు పదార్థాల నిరోధక కమిటీ జిల్లా స్థాయి సమావేశం జరిగింది. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టిన చర్యలపై చర్చించి, వాటి నిరోధానికి అవలంభించాల్సిన చర్యలపై అధికారులకు కలెక్టర్, సీపీ దిశానిర్దేశం చేశారు. గడిచిన రెండు మాసాలలో జిల్లాలో ఎక్సైజ్, పోలీస్ శాఖల అధ్వర్యంలో నిర్వహించిన దాడులు, పట్టుబడిన గంజాయి, అల్ఫ్రాజోలం ఇతర మత్తు పదార్థాలు, నమోదైన కేసుల గురించి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, యువతను, విద్యార్థులను మత్తుకు బానిసలుగా మారుస్తున్న మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. పోలీస్, ఎక్సైజ్, రవాణా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో కమిటీగా ఏర్పడి పక్కాగా కృషి చేయాలన్నారు. ...