ఇంటి ఆడబిడ్డగా వధువు మెడలో తాళి కట్టిన కల్వకుంట్ల కవిత

*ఇంటి ఆడబిడ్డగా వధువు మెడలో తాళి కట్టిన కల్వకుంట్ల కవిత*
తెలంగాణ రక్షణ సేన నాయకుడు తన వివాహం పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా జరగాలని ఆకాంక్షించాడు. తన ఇంటి ఆడబిడ్డ హోదాలో ఉండి పెళ్లి చేయాలని కోరాడు. ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం పెళ్లికూతురు మెడలో తాళి కట్టాలని కోరాడు. పార్టీ నాయకుడి ఆకాంక్షను గౌరవించి ముదిరాజ్ ఇంటి ఆడబిడ్డగా మారి ఆ నాయకుడి ఆకాంక్షను నెరవేర్చారు కల్వకుంట్ల కవిత. ఈ వేడుకకు ఈసీఐఎల్ - కీసర క్రాస్ రోడ్డులో ఆరాధ్య కన్వేషన్ వేదికగా నిలిచింది.
యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు గ్రామానికి చెందిన బాషబోయిన బాలప్రసాద్ తెలంగాణ రక్షణ సేన నాయకుడు. తెలంగాణ జాగృతిలోనూ క్రియాశీలంగా పని చేశాడు. బాలప్రసాద్ కు సీతాఫల్ మండికి చెందిన శివానితో వివాహం నిశ్చయం అయింది. బుధవారం ఉదయం బాలప్రసాద్ - శివాని వివాహ ముహూర్తం కాగా తనకు అక్కాచెల్లెళ్లు లేకపోవడంతో బాలప్రసాద్ కోరిక మేరకు వారి ఇంటి ఆడబిడ్డగా కవిత వ్యవహరించారు. ముదిరాజ్ కులాచారం ప్రకారం వరుడు వధువుకు తాళి కట్టే ముందు ఆడపడుచుతో పసుపు కొమ్ముతో మూడు ముళ్ళు వేయిస్తారు. వారి సంప్రదాయం ప్రకారం కవిత గౌరీ పూజలో పాల్గొని వధువు శివాని మెడలో పసుపు కొమ్ముదారంతో మూడుముళ్లు వేశారు. ఉంగరపు వేలుకు ప్రదానపు ఉంగరం తొడిగారు. ఒడిబియ్యం పోసి పెళ్లి కుమార్తెను ఆశీర్వదించారు. అనంతరం బాలప్రసాద్ శివాని మెడలో మంగళసూత్ర ధారణ చేశారు. ఈ వేడుకలో బాలప్రసాద్ తల్లిదండ్రులు స్వరూప - బాలకృష్ణ, సోదరుడు నాగరాజు, తెలంగాణ రక్షణ సేన నాయకులు పాల్గొన్నారు.
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Popular posts from this blog

రూ.66 కోట్ల ధాన్యం మళ్లింపు కేసు.. నిజామాబాద్ రైస్ మిల్లు యజమానిపై కేసు నమోదు

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

PCC చీఫ్ పై ' బిగ్' కుట్ర -- మహేష్ ఇమేజ్ డ్యామేజ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!