ఇందూరురెడ్ క్రాస్ మీద RSS జెండా ఎగిరేనా?
నిజామాబాద్ రెడ్ క్రాస్ సంస్థకు మొదటిసారి బహిరంగ ఓటింగ్ పద్ధతిన ఎన్నిక జరగబోతోంది.
ఇప్పటివరకు బుస్స ఆంజనేయులు, తోట రాజశేఖర్ టీమ్ కనుసన్నల్లో రెడ్ క్రాస్ కొనసాగుతోంది.. సహకార శాఖ పర్యవేక్షణ లో బహిరంగంగా జరగాల్సిన ఎన్నికను వీరు ప్రహసనం గా మార్చారు.. లోలోపల ఎన్నిక తంతును మమ అనిపించి పాలన వ్యవహారాలలో చక్రం తిప్పుతూ వస్తోంది ఆంజనేయులు టీమ్..
రాష్ట్రీయ స్వయంసేవన్ భావజాలం కలిగిన ఇందూర్ సేవాసమితి రంగంలోకి దిగింది. ఆంజనేయులు కబంధ హస్తాల నుంచి రెడ్ క్రాస్ ను విముక్తి చేసేందుకు ప్యానల్ ను ప్రకటించి శక్తి వంచన లేకుండా పని చేస్తోంది.
9800 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.29 మంది పోటీలో ఉన్నారు రెండు ప్యానల్ ల నుంచి..కట్ ఆఫ్ మెరిట్ ప్రాతిపదికన 15 మంది ని విజేతలుగా ప్రకటిస్తారు.. గెలిచిన ఈ 15 మందితో కమిటీ ఏర్పడనుంది..
మొదటి సారి బహిరంగంగా ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో స్థానిక ప్రముఖులు పోటీలో నిలిచారు. డాక్టర్లు, న్యాయవాదులు, ఉద్యోగులు,వ్యాపారులు ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా పాల్గొంటున్నారు. దీనితో రేపు ఆదివారం స్థానిక హరిచరన్ మార్వాడి స్కూల్ లో జరిగే పోలింగ్ ఎట్లా జరుగుతుందనే ఆసక్తి నెలకొంది..
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇


Click here to 👆 Follow Our WhatsApp Channel