BJP కార్పొరేటర్ వసూళ్లపై పోరాటం

నిజామాబాద్,
ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ మఠం పవన్ రాజకీయ కక్ష సాధింపుతో ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అసోసియేషన్ పై పుకార్లు పుట్టిస్తూ జిల్లా కలెక్టర్ ,మున్సిపల్ కమిషనర్ లకి ఫిర్యాదు చేయడం అత్యంత హేయమైన చర్య అని ఆర్ ఆర్ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.... మున్సిపల్ ఎన్నికలలో గెలుపొందిన నిజామాబాద్ సౌత్ డివిజన్ల కార్పొరేటర్లకు సన్మానం చేయాలని సదుద్దేశంతో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ భవనము మరమ్మత్తులు జరుగుతుండడం వలన స్థానికంగా ఉన్న వాటర్ ప్లాంట్ లో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వాటర్ ప్లాంట్ ను డాక్టర్ గ్రూప్ వారు 15 సంవత్సరములు అద్దెకు తీసుకున్నారని , ఇంకా ఏడు సంవత్సరాల కాల పరిమితి మిగిలి ఉందన్నారు. తాము అనుమతితో సన్మాన కార్యక్రమం నిర్వహించామని, సన్మాన కార్యక్రమంలో మఠం పవన్ ని కూడా సన్మానించామన్నారు. కానీ తాను రాజకీయ బురద చల్లడం కోసం వాటర్ ప్లాంట్ ను కబ్జా చేసేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కార్పొరేటర్ గా ఎన్నికై రెండు నెలల పదవీకాలం నడుస్తున్న పవన్ ధనార్జనే ద్యేయంగా అనేక అక్రమాలు చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.విజయ్ అనే మధ్యవర్తిని పంపి నూతనంగా భవనాలు నిర్మిస్తున్న పేద ,మధ్యతరగతి వారిని ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా అసోసియేషన్ లో ఉన్న ఒక సభ్యుడిని బెదిరింపులకు పాల్పడడంతో ఐదవ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసామని చెప్పారు.పవన్ పై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యిందని తెలిపారు. పవన్ అసోసియేషన్ సభ్యులందరికీ బహిరంగంగానే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు., లేనిపక్షంలో న్యాయం జరిగే వరకూ పోరాడతామని వారు తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నరసింగరావు, కోశాధికారి రమణ గౌడ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

మంద కృష్ణ మాదిగపై కుట్ర CMO కనుసన్నల్లో యాక్షన్ టీమ్స్