నిజామాబాద్‌లో బలవంతపు పన్ను వసూళ్లు? ఇంట్లో ఫ్రిజ్ జప్తు !
నిజామాబాద్ ప్రజలు ఇంకా నిజాం నవాబు పాలనలో ఉన్నామా అంటూ ముక్కున వేలు వేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది..
నిజాం నిరంకుశ పాలనలో పన్నుల వసూలు కర్కశంగా ఉండేది..
రజాకార్లను రంగంలోకి దింపి పన్నులు కట్టమని.. ఇంట్లో కనపడిన వస్తువులను ఎత్తుకుని పోయేవారు.. తెలంగాణ రాష్ట్రం సిద్దించక ముందు TDP, కాంగ్రెస్ హయాంలోనూ నిజాం కాలంనాటి జప్తులు కొనసాగేవి..పన్నులు కట్టడం లేదంటూ ఇరుగుపొరుగు వారిని పిలిచి ఇజ్జత్ తీసి ఇంటి దర్వాజలు,కిటికీలు పీక్కపోయి పరువు తీసేవారు అంజువాన్ అధికారులు..అంటే సహకార శాఖ వసూల్ సిబ్బంది..
13 ఏళ్లలో ఇలాంటి బూజు పట్టిన నవాబు కాలంనాటి బలవంతపు పన్నుల వసూళ్ళు జరుగలేవు..
ఘనత వహించిన నిజామాబాద్ బల్దియా మాత్రం నిజాం తరహా పన్ను వసూళ్లకు బరితెగించారు. శ్రీరామ నవమి పండుగరోజే మిడుతలు దండు వలే నిజామాబాద్ నగరం ఎల్లమ్మ గుట్ట ప్రాంతంలోని విజయ్ టాకీస్ వెనకాల అనౌన్స్ మెంట్ వెహికిల్స్ తో ఎంటరయ్యారు.. నవీన్ అనే మధ్య తరగతి ఇంట్లోకి దూరి ఇంట్లోని వస్తువులను జప్తు చేసేందుకు హడావిడి చేశారు మున్సిపల్ కార్పోరేషన్ ఉద్యోగులు..18000 ఇంటి పన్ను ఇప్పటికిప్పుడు కట్టితీర వల్సిందే అంటూ హుకుం జారీచేశారు..5000 స్పాట్లో కడుతామని..మిగతా టాక్సు వాయిదాల పద్ధతిన కడుతామని ఎంత బతిమాలినా వినకుండా కిచెన్ లోని ప్రిడ్జీ ని జప్తు చేసి రోడ్డుపై పెట్టారు.. దీనితో అక్కడికి చేరిన ఇరుగుపొరుగు వారంతా ఖంగు తినడమే వారి వంతు అయ్యింది.
శ్రీరామ నవమి పండుగ రోజునే పబ్లిక్ గా జరిగిన పరాభవంతో నవీన్ కుటుంబం తల్లడిల్లి పోయింది..
అంతటితో ఆగకుండా మంగళవారం మళ్ళీ మునిసిపల్ అధికారులు నవీన్ ఇంటికి వెళ్లి జులుం చేశారు.. దాదాగిరి చేలాయించారు. ఇవ్వాళ ఏకంగా నవీన్ ఇంటికి నీరు సరఫరా అయ్యే కుళాయిని ఇరగొట్టి ప్రతాపం ప్రదర్శించారు.. ....
లక్షలు, కోట్లు ఆస్థి పన్ను బాకీ పడిన సంపన్నుల వైపు కన్నెత్తి చూడడానికి జంకే మునిసిపల్ అధికారులు పేదలు,మధ్య తరగతి ప్రజలపై జులుం చేయడం దుర్మార్గం.విచిత్రం ఏమిటంటే కోట్ల వ్యాపారం జరిగే హోటళ్లు, షాపింగ్ మాల్స్ కు వెళ్లి ఆస్థి పన్ను కట్టండంటూ మాల్స్ ను సీజ్ చేసే ధైర్యం చేస్తలేరు. బలహీనులపై జులుంచేసి మొదటి రోజే మంగళవారం సాయంత్రం వరకు కోటి రూపాయలు పన్ను వసూలు చేశామని భింకం ప్రరదర్శించారు మునిసిపల్ డిప్యూటీ కమిషనర్ రవి బాబు.
మన నిజామాబాద్ టీమ్ రవి బాబుని వివరణ కోరగా ఎల్లమ్మ గుట్ట లో ప్రిడ్జీ జప్తు చేసిన విషయం తన దృష్టికి రాలేదని తప్పించుకున్నారు.
ప్రజలు ఆస్థి పన్ను కట్టకుంటే మునిసిపల్ ఉద్యోగులకు జీతభత్యాలు..
ప్రజా ప్రతినిధుల సమావేశాల్లో చాయి,బిస్కెట్స్ కూడా దిక్కు ఉండదు.. అట్లాంటి పన్ను చెల్లింపు దారుల పట్ల జులుం చేయకుండా ,మర్యాదను బజారుపాలు చేయకుండా వ్యవహరిస్తే మంచిది..
లేకుంటే నైజాం కాలంలో ఎదురైన ధిక్కారం చవి చూడక తప్పదని బల్దియా గుర్తిస్తే మంచిది.. లేకుంటే ఇందూరు పౌరుషం కట్టలు తెంచుకోవడం ఖాయం... .....
BJP మౌనం వెనక?
ఎన్నికలప్పుడు నిజాము పాలనపై ఒంటి కాలుపై లేచిన BJP... ఎల్లమ్మ గుట్టలో నిజాం నిరంకుశ పాలన తరహాలో పన్ను వసూలుకు బరితెగించి సంఘటనపై మౌనంగా ఉండడం వెనుక మతలబెమిటనే చర్చ జరుగుతోంది. ఎల్లమ్మ గుట్ట సంఘటనపై BJP వైఖరిని తెలుసుకునే ప్రయత్నం మన నిజామాబాద్ టీమ్ చేసింది.. ఊర్లో లేనని మునిసిపల్ డిప్యూటీ ప్లోర్ లీడర్ జ్యోతి తప్పించుకున్నారు.. కార్పొరేటర్ బంటు రామును సంప్రదించగా ప్లోర్ లీడర్ ప్రమోద్ పార్టీ వైఖరి చెబుతారని సైడ్ అయి పోయారు.. ఆతరువాత బలవంతపు పన్ను వసూలుపై కౌన్సిల్ లో ప్రధాన ప్రతిపక్షం BJP వైఖరి ఏమిటో స్పష్టం చేయకుండా మిన్నకుండి పోవడం కొసమెరుపు..
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Click here to 👆 Follow Our WhatsApp Channel