ఎస్సారెస్పీని సందర్శించిన మంత్రులు.. వరద ప్రవాహం, నీటి నిల్వలపై సమీక్ష

నిజామాబాద్, ఆగస్టు 01 : నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ లో గల శ్రీరాంసాగర్ రిజర్వాయర్ ను శనివారం రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐ.టీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, మైనింగ్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తదితరులు జిల్లా ఉన్నతాధికారులతో కలిసి సందర్శించారు. ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలతో ఎగువ ప్రాంతం నుండి ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న వరద ప్రవాహాన్ని (ఇన్ ఫ్లో) పరిశీలించారు. రిజర్వాయర్లో నీటి మట్టాన్ని పరిశీలించి ప్రాజెక్టుకు చెందిన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎగువన గల గైక్వాడ్, విష్ణుపురి ప్రాజెక్టులు, బాలేగాం, బాబ్లీ బ్యారేజీలతో పాటు కడెం తదితర ప్రాజెక్టుల మిగులు జలాలు గోదావరి ద్వారా వచ్చి చేరుతుండటంతో ఎస్సారెస్పీలో నీటి మట్టం పెరిగిందని అధికారులు మంత్రుల దృష్టికి తెచ్చారు. ఇప్పటికిప్పుడు వర్షాలు నిలిచిపోయినా, మరో 48 గంటల వరకు వరద నీరు ఇన్ ఫ్లో రూపంలో వస్తుందని అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఎస్సారెస్పీ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఎగువ ప్రాంతాల నుండి శనివారం మధ్యాహ్నం సమయానికి 85వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోందన్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వలను బట్టి ఆయకట్టు పంటలకు ఏ మేరకు నీటిని విడుదల చేయాలని అన్న విషయమై రెండు మూడు రోజులలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో 2019 లో నిర్మించిన మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజీలు మాత్రం 2022 నాటికే కూలిపోయాయని మంత్రి ఉత్తమ్ కుమార్ ఆక్షేపించారు. వీటి అవసరం లేకుండానే ఎల్లంపల్లి రిజర్వాయర్ లోకి 20 టీఎంసీ ల నీరు వచ్చి చేరిందని అన్నారు. మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజీల విషయంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. పై బ్యారేజీలలో నీటిని నిలువ చేసే పరిస్థితి లేదని నిపుణులు చెబుతున్నారని, అన్ని విషయాలను శాస్త్రీయంగా, సాంకేతికపరంగా సమగ్ర పరిశీలన జరిపి మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజీలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ బ్యారేజీల విషయంలో తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇటీవల ఢిల్లీలో అత్యున్నత స్థాయిలో జరిగిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ, కేంద్ర జల సంఘం సమావేశాల్లోనూ ఏకీభవించడం జరిగిందని మంత్రి తెలిపారు.
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Popular posts from this blog

రూ.66 కోట్ల ధాన్యం మళ్లింపు కేసు.. నిజామాబాద్ రైస్ మిల్లు యజమానిపై కేసు నమోదు

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

PCC చీఫ్ పై ' బిగ్' కుట్ర -- మహేష్ ఇమేజ్ డ్యామేజ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!