డీసీసీ నగేష్ రెడ్డి న్యూసెన్స్ మేయర్ ఉమారాణికి అవమానం

డీసీసీ నగేష్ రెడ్డి న్యూసెన్స్ మేయర్ ఉమారాణికి అవమానం

(జమాల్పూర్ గణేష్/మూల్పూరు రాజేంద్ర బాబు) ఆమె నగర ప్రధమ పౌరురాలు..ఆరణాల ,సాంప్రదాయ కుటుంబం నుండి వచ్చిన శ్రమైక జీవితం నుంచి PCC చీఫ్ మహేష్ గౌడ్ ప్రోద్బలంతో నిజామాబాద్ మేయర్ పీఠాన్ని అధిరోహించారు.. ఆమెనే కూరగాయల ఉమారాణి.. అతి సాదా సీదాగా,విలువలకు కట్టుబడిన ఆమెకు ఇందూర్ కాగ్రెస్ లో అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నయి.. ఈ దుస్థితికి అద్దం పట్టే..మేయర్ కు పబ్లిక్ గా అవమానం జరిగిన సంఘటన శుక్రవారంనాడు వెలుగు చూసింది. ఆ అవమానం మహిళా మేయర్కు జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు నగేష్ రెడ్డి తోనే ఎదురవ్వడం యాదృచ్చికం అనుకోవడానికి ఏ మాత్రం అవకాశం లేదు..వివరాల్లోకి వెళితే.. రాహుల్ గాంధీకి ఇష్టమైన ఓట్ చోరీ ప్రోగ్రామ్ కోసం ఢిల్లీకి కార్యకర్తలను పంపడానికి నిజామాబాద్ పాలిటెక్నిక్ మైదానంలో బస్సులను ఉంచారు.. జెండా ఊపి బస్సులను పంపడానికి నగేష్ రెడ్డి,గడుగు గంగాధర్, బొబ్బిలి రామకృష్ణతో పాటు మేయర్ పాలిటెక్నిక్ మైదానానికి చేరుకున్నారు.. ప్రధమ పౌరురాలు ఉమ రాణి చేతిలో ఉన్న జెండాను లాక్కున్న నగేష్ రెడ్డి..ఆమె భుజం మీద చెయ్యి వేసి ముందుకు జరిపారు. అతి సాధారణ మహిళ కాబట్టి అలుసుగా తీసుకున్న నగేష్ రెడ్డి ఆసాంతం భుజంపై చేయివేసి ఫోటోలు,విడియో లో తనకు అడ్డురాని ఆంగిల్ వరకు ఆమెను తాకడం అక్కడున్న వాళ్ళను షాక్ కు గురిచేసింది.. ఒక వైపు మెమొంతో మా వాటా అంత కావాలని సామాజిక న్యాయం కోసం కొట్లాడుతుంటే.. రిజర్వేషన్ పుణ్యమా అని అంది వచ్చిన అత్యున్నత అధికార హోదా చేజిక్కించుకున్న ప్రధమ పౌరురాలికె అవమానం తప్పలేదు DCC అధ్యక్షుడి చేతిలో.. ఇది ఇప్పుడు మాత్రమే ఎదురైన అవమానం కాదు.. మేయర్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ఆమె అవమానాలు చవిచూస్తూనే ఉన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగే పార్టీ కార్యాలయంలో కూడా పురుష పుంగవులే ఫోటోల్లో పడడానికి మేయర్ను ఏదో ఒక కొనకు నెట్టడం కామన్ అయ్యింది.. PCC చీఫ్ నరేందర్ రెడ్డి భార్య కార్పొరేటర్ గా ఓడిపోవడంతో ఆ అవకాశం ఉమారాణి ముదిరాజ్ కు దక్కింది.. అప్పటి నుంచి కాంగ్రెస్ లో ఒక వర్గానికి ఉమారాణి ఎదుగుదల కంటగింపుగా మారింది.. దానిలో భాగమే ఈ వరుస అవమానాలు.. పార్టీ పెద్దలు జోక్యం చేసుకోకుంటే సామాజిక పొరపొచ్చాలు రావడం తధ్యం.....
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Popular posts from this blog

రూ.66 కోట్ల ధాన్యం మళ్లింపు కేసు.. నిజామాబాద్ రైస్ మిల్లు యజమానిపై కేసు నమోదు

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

ఇది నాగడ్డ.. అడ్డొస్తే అంతేసంగతి! -గుంపు మెస్త్రితో ముఠామెస్త్రి ఢీ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

PCC చీఫ్ పై ' బిగ్' కుట్ర -- మహేష్ ఇమేజ్ డ్యామేజ్