యాదవ సమాజ అభివృద్ధికి విద్యావంతుల ఐక్య వేదిక.. నిజామాబాద్ జిల్లా అధ్యక్షురాలిగా మంజుల యాదవ్


యాదవ సమాజాన్ని ఉద్ధరించేందుకే విద్యావంతుల ఐక్య వేదిక.
జిల్లా అధ్యక్షురాలిగా మంజుల యాదవ్.
నియామక పత్రం అందజేసిన రాష్ట్ర అధ్యక్షుడు చలకాని వెంకట్ యాదవ్.
హాస్టల్ భవనం కోసం లక్ష విరాళం అందజేస్తా.
యాదవ సమాజాన్ని ఉద్ధరించేందుకే విద్యావంతుల ఐక్య వేదిక ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ యాదవ్ అన్నారు. గురువారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ముందుగా విద్యావంతుల జిల్లా అధ్యక్షురాలిగా దండేమేని మంజుల యాదవ్ కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు చలకాని వెంకట్ యాదవ్ మాట్లాడుతూ.. యాదవ సమాజాన్ని చైతన్య పరిచేందుకు గ్రామ గ్రామాన అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తామన్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందంటే అందుకు కారణం విద్యావంతుల వేదిక ఏర్పాటు చేయడమేనని, విద్య ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని నమ్మి ఈ కార్యక్రమాన్ని పూనుకున్నట్లు తెలిపారు. యాదవ సమాజం అభివృద్ధి చెందాలన్న, రాజకీయంగా రాణించాలన్న ముందుగా సమాజంపై అవగాహన ఉండాలన్నారు. అన్ని జిల్లాలలో విద్యావంతుల వేదిక ఏర్పాటు చేసి, ఒకే తాటిపైకి వచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు.
జిల్లా అధ్యక్షురాలు మంజుల యాదవ్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, యాదవ సమాజం అభివృద్ధిలో నా పాత్రను గ్రహించి, జిల్లా అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం సంతోషంగా ఉందన్నారు. యాదవ సమాజం అభివృద్ధికి తన వంతు కృషి తప్పక ఉంటుందన్నారు. తనపై నమ్మకంతో అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించినందుకు రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. మేమెంతో మాకంత వాట దక్కాలన్న ముందుగా యాదవులలో చైతన్యం రావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లాలో పూర్తిస్థాయిలో కమిటీ ఏర్పాటు చేసి, గ్రామ గ్రామాన ఉన్న యాదవుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. యాదవులను భయాందోళనలకు గురిచేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లాలో వీడీసీలతో యాదవ కులస్తులు కొంత మేరకు ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లారు. త్వరలోనే యాదవ కులస్తులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. రాష్ట్ర రాజధానిలో హాస్టల్ భవనం కోసం లక్ష రూపాయలు విరాళంగా అందజేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఒక మహిళగా ముందుకు అడుగు వేయాలంటే ఎంత కష్టమో అందరికీ తెలుసాని, అలాంటి తనకు తోడు నీడగా ఉంటూ రాష్ట్ర అద్యక్షులు వెంకట యాదవ్ ప్రోత్సహిస్తూ ఉండటం సంతోషంగా ఉందన్నారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనకడుగు వేయకుండా జాతిని చైతన్యం చేయడంతో పాటు, సంఘ నిర్మాణంతో పాటు విద్యార్థుల అభివృద్ధి విద్యా ఉద్యోగ రంగాల్లో ముందుకు తీసుకువెళ్లడంలో ముఖ్య భూమిక పోషిస్తామన్నారు.ఈ విలేకరుల సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ బైకన్ మహేష్ యాదవ్, ఎర్రం గణేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి గుజ్జ అశోక్ యాదవ్, కార్యదర్శి రాసగిరి యాదవ్, దినేష్ యాదవ్, స్పోక్స్ పర్సన్ ప్రవీణ్ యాదవ్, కోశాధికారి కోశాధికారి లక్ష్మణ్ యాదవ్, కార్యవర్గ సభ్యులు గంగాధర్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, సంజీవ్ యాదవ్, అనూష యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Popular posts from this blog

రూ.66 కోట్ల ధాన్యం మళ్లింపు కేసు.. నిజామాబాద్ రైస్ మిల్లు యజమానిపై కేసు నమోదు

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

ఇది నాగడ్డ.. అడ్డొస్తే అంతేసంగతి! -గుంపు మెస్త్రితో ముఠామెస్త్రి ఢీ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

PCC చీఫ్ పై ' బిగ్' కుట్ర -- మహేష్ ఇమేజ్ డ్యామేజ్