ఏప్రిల్ 25న కొత్త రాజకీయ పార్టీ ప్రకటన: కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన

నిజామాబాద్,
ఏప్రిల్ 25న రాజకీయ పార్టీ ప్రకటిస్తామని తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రకటించారు. శుక్రవారం నిజామాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో అనేక విషయాలను వెల్లడించారు..
కవిత మాటల్లోనే..
*రాజకీయ పార్టీగా మారబోతోంది తెలంగాణ జాగృతి.
*ఏప్రిల్ 25న మునీరాబాద్ వేదికగా పార్టీ జెండా, అజెండాను ప్రకటిస్తాం.
*తెలంగాణ భవిష్యత్ మార్చే దారి దీపం కాబోతున్నాం.
*సర్వోదయ తెలంగాణ కావాలన్నదే మా లక్ష్యం. ఆ లక్ష్యం కోసం పనిచేస్తాం.
*మేము పెట్టబోయే పార్టీ తెలంగాణ ఇంటి పార్టీ. మా ఫోకస్ మొత్తం తెలంగాణ కోసమే.
*మేము ఎవరికీ బీ టీమ్ కాదు. తెలంగాణలో మాదే నంబర్ వన్ పార్టీ అవుతుంది.
*మహిళలు, యువత, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు మేధావులంతా పార్టీ ఆవిర్భావ సభకు రావాలని విజ్ఞప్తి చేస్తున్.
*ప్రజాభిప్రాయం తీసుకొని పాలనలో వైఫల్యాలను రాముల వారు సరిచేసుకున్నార.
*రాముల వారు స్ఫూర్తితో మా పార్టీని నడిపిస్తాం.
*రాజకీయ పార్టీకి ఈగో ఉండకూడదు. నన్ను విమర్శించిన వాళ్లైనా సరే తెలంగాణ సోయి ఉంటే మాతో కలిసి రండి.
*మా అజెండా మొత్తం కూడా ప్రాక్టికల్ గా, ప్రజల ఆమోదం పొందేలా ఉంటుంది.
*ఏదైనా పని పట్టుకుంటే ఫలితం వచ్చే వరకు కూడా వదిలిపెట్టన.
*ఢిల్లీలో లాబీయింగ్ చేయగలను. గల్లీలో కష్టపడగలన.
*ఇవ్వాళ శ్రీరాముడి జయంతి, అదే విధంగా ఆయన పెళ్లి రోజు
*దేవుడి కళ్యాణం అంటే లోక కల్యాణం అన్నట్లే.
*ప్రజలను హత్తుకొని పరిపాలన చేసిన వ్యక్తి శ్రీరామ చంద్రుల వారు.
*ఆయన స్ఫూర్తితో మేము కూడా ముందుకు సాగాలని అనుకుంటున్నాం.
*తెలంగాణలో ఇప్పుడున్న రాజకీయ పార్టీలు, వాటి కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను మనం చూస్తున్నాం.
*నేను తెలంగాణ బిడ్డను, నిజామాబాద్ కోడలిని.
*ఈ ప్రాంతానికి ఎంతో ఘన చరిత్ర ఉంది.
*గౌతమ బుద్దుడి సమయంలో 16 జనపదాలుంటే...బోధన్ నుంచి అస్మక జనపదం ఉండేది. బౌద్ద, జైన, సూఫీ మతాల్లో మంచిని ఇక్కడి ప్రజలు పాటించారు.
*నిజామాబాద్ మట్టిలోంచి పుట్టిన ఏ ఆలోచన అయిన కూడా సక్సెస్ అయ్యింది.
*ఇక్కడి మోతె మట్టి మహిమతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం.
*కానీ తెలంగాణ వచ్చిన 12 ఏళ్ల తర్వాత కూడా మనం నీళ్లు, నిధులు, నియామకాలు విషయంలో సంపూర్ణ విజయం సాధించలేదు.
*బీఆర్ఎస్ పదేళ్ల పాలన అలా ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలన కూడా మనం చూస్తున్నాం.
*ఇవ్వాళ పేపర్లో రెండు వార్తలను చూశా. ఒకటి బస్సు ప్రమాదం, మరొకటి భువనగిరిలో చిన్న పిల్లాడి కనుగుడ్డు కుక్క పీక్కోని పోవటం.
*బస్సు ప్రమాదంలో 14 మంది చనిపోయారు. చేవెళ్ల బస్సు ప్రమాదం తర్వాత స్లీపర్ కోచ్ లను రద్దు చేయాలని మనం డిమాండ్ చేశాం.
*అయినా పట్టించుకోలేదు. అంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు.
*ఎవరి కోసం, ఎందుకోసం ఒక కొత్త రాజకీయ పార్టీ రావాలి?
అంటే ప్రతి రోజు బాధపడుతున్న ప్రజల తరఫున పోరాడేందుకు కొత్త రాజకీయ పార్టీ అవసరం ఉంది.
*ఇప్పటికీ కూడా మక్క కొనుగోలు కేంద్రాలను పెట్టమని అడగాల్సిన పరిస్థితి ఉంది.
*నిజామాబాద్, వరంగల్ సహా చాలా చోట్ల మక్క రైతులకు మద్దతు ధర కూడా రావటం లేదు.
*రైతులు, మహిళలు, పిల్లలు, భద్రత ఇలా చాలా అంశాలను పట్టించుకోవాల్సి ఉంది.
*కానీ ముఖ్యమంత్రులు అయ్యే వరకు అన్నట్లుగానే అన్ని రాజకీయ పార్టీల ఒరవడి ఉంది.
*అందుకే తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ అవశ్యకత ఉందని మేము గట్టిగా నమ్ముతున్నాం.
*తెలంగాణ లో సర్వ జనులకు కొత్త వెలుగులు రావాలి. అందుకే సర్వోదయ తెలంగాణ కావాలి.
*కులాలు, మతాలు, వర్గాలు కాకుండా ప్రజల కోసం పనిచేసే పార్టీ కావాలి.
*గత 20 ఏళ్లుగా నేను మీ కళ్లముందే ప్రజల కోసం పనిచేస్తున్నది మీరు చూస్తున్నారు.
*బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు పెన్షన్ ఇచ్చారు.
అందులో 350 మంది రైతుల పేర్లు లేకపోతే ఆ కుటుంబాలకు జాగృతి తరఫున నెలకు 2500 పెన్షన్ ఇచ్చాం.
*2014 నుంచి 2018 వరకు కూడా మేము పెన్షన్ ఇచ్చాం.
*రాష్ట్రం రాకముందు, వచ్చిన తర్వాత కూడా మేము పనిచేస్తూనే ఉన్నాం.
*కొత్త తరహాలో ఆలోచించే శక్తివంతమైన వ్యక్తులు అవసరం ఉంది. అందుకే మేము రాజకీయ పార్టీ పెడుతున్నాం.
*మేడ్చల్ లోని మునీరాబాద్ వేదికగా ఏప్రిల్ 25 వ తారీఖు ఉదయం మా పార్టీని ప్రకటించబోతున్నాం.
*నేను ముహుర్తాలను నమ్ముతాను. కాలానుగుణంగా పనిచేస్తే ప్రజలకు మంచి జరుగుతుందని నమ్ముతున్నా.
*మార్పు రావాలని భావించే వారందరినీ కూడా పార్టీ ఆవిర్భావ సభకు ఆహ్వానిస్తున్నా.
*ప్రొఫెసర్ జయశంకర్ సార్ అంటే నాకు చాలా అభిమానం. ఆయన తో పాటు ప్రముఖుల పేర్లను కూడా పార్టీ ఆవిర్బావ వేడుక సభలో వేదికలకు పెట్టుకుంటాం.
*యువ మిత్రులు ఇప్పటికీ జాబ్ కోసం వేచి చూస్తున్నారు.
*వాళ్లంతా కూడా మా పార్టీ లో రావాలని, పార్టీ ఆవిర్భావ సభకు రావాలని కోరుతున్నా.
*మగవాళ్లు నడిపే పార్టీలను చూశాం. ఆడబిడ్డగా నేను పెట్టబోయే పార్టీకి ఆడబిడ్డల ఆశీర్వాదం కావాలి.
*ప్రతి ఊరు నుంచి మా ఆడబిడ్డలంతా సభకు రావాలి.
నిజమైన మార్పు ఎలా ఉంటుందో మేము చేసి చూపిస్తాం.
*బీసీ బిల్లు సాధించుకోవాలనున్న కూడా నీతి,నిజాయితీ ఉన్న జాగృతి తోనే సాధ్యమవుతుంది.
*ఎస్సీ లకు ఎప్పుడు అన్యాయం జరిగిన మేము అండగా నిలబడ్డాం.
*ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ది కావాలంటూ...అసెంబ్లీలో అంబేడ్కర్ విగ్రహాం కోసం పోరాటం చేశాం.
*హతీరాం మఠాన్ని కాపాడుకున్నాం. బంజారా కోసం ఎన్నో పనులు చేశాం.
*ఆదివాసీ కోసం పనిచేశాం. నాంచారమ్మను గుర్తుచేసుకున్నాం.
*సమ్మక్క, సారలమ్మ లను మనం ఎంతో గౌరవించుకున్నాం.
*తెలంగాణ రాగానే మైనార్టీలకు ఏదో జరిగిపోతుందని వారికి మాయ మాటలు చెప్పారు.
కానీ జాగృతి మాత్రం మైనార్టీల గొంతుగా ఉంటుందని చెబుతున్నా.
*మైనార్టీ క్రిస్టియన్ సోదరుల కోసం కూడా జాగృతి పనిచేస్తుంది.
*సిక్కుల కోసం జాగృతి ప్రత్యేకంగా ఒక వింగ్ నే ఏర్పాటు చేసింది.
*శ్రామికులంటే నాకు ఎంతో ఇష్టం. సింగరేణి కార్మికుల కోసం ఎన్నో పనులు చేశాం.
*ఆశావర్కర్లు, అంగన్ వాడీలు, అవుట్ సోర్సింగ్, ఆర్ఎంపీ లు, పీఎంపీలు, కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ కోసం కూడా పనిచేశాం.
వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్ల కోసం పార్లమెంట్ లో కొట్లాడం.
*రైతన్న కోసం కూడా జాగృతి పనిచేస్తుంది.
*తెలంగాణ కోసం పనిచేసే వాళ్లు, పనిచేసిన వాళ్లు అందరూ కూడా మా సభకు రావాలి.
*బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, కార్మికులు, రైతులు, యువత అందరూ కూడా సభకు వచ్చి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతున్నా.
*జాగృతి అజెండా కోసం ఇప్పటికే 50 కమిటీలు వేశాం.
ఇంకా చాలా మంది మేధావులతో చర్చలు జరుపుతున్నాం.
*జాగృతి రాజకీయ పార్టీగా ఇంకా ఏయే అంశాల్లో పనిచేయాలో సూచించాలని తెలంగాణ ప్రజలను కోరుతున్నా.
*మా పార్టీ ఆవిర్భావానికి ఇంకా 28 రోజులు ఉంది.
*సామాజిక తెలంగాణ, అభ్యుదయ తెలంగాణ కోసం అందరినీ కలుస్తాం.
*శ్రీరామనవమితో మొదలైన పార్టీ ప్రకటనను వారణాసి వెళ్లి గంగా స్నానం చేసిన తర్వాత పార్టీ ఆవిర్భావం చేస్తాం.
కాశీలో శివుని అభిషేకం చేసిన తర్వాత పార్టీ సభ నిర్వహిస్తాం.
*నిజాబామాద్ బిడ్డల నన్ను ఆశీర్వదించి పార్లమెంట్ కు పంపి నాకు రాజకీయ జీవితం ఇచ్చారు.
వారి కారణంగానే ఎన్నో పనులు, ఎంతో మంది పరిచయం అయ్యారు. *పాలిటిక్స్ అనేవి మన జీవితాలు మార్చేస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో భాగం కావాలి.
*రాజకీయాలు ఏమీ రాకెట్ సైన్స్ కాదు. అందరూ రాజకీయాల్లో చేరి మార్పు కోసం ప్రయత్నించండి.
*తెలంగాణ భవిష్యత్ ను మేము కచ్చితంగా తీర్చిదిద్దుతాం.
*రాష్ట్రం వచ్చాక 12 ఏళ్ల తర్వాత కూడా మౌలిక వసతుల కోసం అడుక్కోవాల్సన అవసరముందా?
*తెలంగాణ వచ్చాక ఎస్సీ, ఎస్టీల నిధులు పక్కదారి పట్టకుండా చట్టం చేసుకున్నాం.
అయిన సరే నిధులు పక్క దారి పడుతున్నాయి. మైనార్టీలకు ఇవ్వాల్సినంత బడ్జెట్ ఇవ్వటం లేదు.
*రాజకీయ నాయకుల్లో ప్రజలు అడగరు అనే ఒరవడి ఉంది.
అందుకే మనం ప్రశ్నిస్తూ ఫలితం వచ్చే వరకు పోరాటం చేయాలి.
*నేను ఏదైనా ఇష్యూ పట్టుకుంటే ఫలితం వచ్చే వరకు వదలను.
*ఇక్కడున్న ఎంపీ అరవింద్ మతిమరుపు నాయకుడిలా ఉన్నారు. నేను ఎంపీగా ఉన్నప్పుడు రైల్వే బ్రిడ్జి అంటూ విమర్శలు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన ఏడేళ్లైనా దాన్ని పట్టించుకోవటం లేదు.
*ప్రతిపక్షం లో ఉంటే క్రిటిసిజం, అధికారంలో ఉంటే ఎస్కేపిజం.
*బీఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసింది. అయిన సరే ప్రజల్లో ఉండి వారి కోసం పనిచేయాలని నేను నిర్ణయం తీసుకున్నా.
*కొత్త పార్టీ వచ్చిందంటే ఎవరికో బీ పార్టీ అంటూ విమర్శలు చేస్తారు.
కానీ మేము ఎవరికీ బీ పార్టీ కాదు. తెలంగాణలో మాదే నంబర్ వన్ పార్టీ అవుతుంది. *అనుభవజ్ఞులు, యువత మేళావింపుతో మా పార్టీ ఉంటుంది.
*శ్రీరాముడు తన పాలన గురించి ఫీడ్ బ్యాక్ తీసుకొని తప్పుంటే మార్చుకున్నాడు.
*ప్రజల కోసం కుటుంబాన్నే పక్కన పెట్టారు. అందుకే ఆయనను ఇప్పటికీ తలుచుకుంటాం.
*పార్టీ పెట్టిన తర్వాత నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటా.
*నేను ఎంపీ అయినప్పుడు నిజామాబాద్- పెద్దపల్లి రైల్వే లైన్ పూర్తి చేస్తానని అంటే నవ్వారు.
25 ఏళ్లుగా జరగనిది ఇప్పుడు అవుతుందా అన్నారు. *కానీ మూడేళ్లలో నేను ఆ పని చేసి చూపించా. నేను ఢిల్లీలో లాబీయింగ్ చేస్తా. అవసరమైతే గల్లీ లో కష్టపడతా.
*జాగృతియే తెలంగాణ ప్రాంతీయ, ఇంటి పార్టీ అవుతుంది. మా ఫోకస్ అంతా తెలంగాణపైనే.
*తెలంగాణ తొలి దశ, మలిదశ ఉద్యమకారుల అనుభవాన్ని రాష్ట్రాభివృద్ధి కోసం ఉపయోగించుకుంటాం.
*వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల కోసం పోరాడుతాం. మేము అధికారంలోకి వచ్చాక వారి అభివృద్ధికి కృషి చేస్తాం.
*రాజకీయ పార్టీ కి ఇగో ఉండకూడదు. తెలంగాణ కోసం పనిచేసే వాళ్లను గతంలో నన్ను విమర్శించిన వాళ్లైనా సరే పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను.
*బీఆర్ఎస్ క్యాడర్ కూడా చాలా వరకు మాతోనే ఉంది.
*మా అజెండా మొత్తం కూడా ప్రాక్టికల్ గా, ప్రజల ఆమోదం పొందే విధంగా ఉంటుంది.

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

మంద కృష్ణ మాదిగపై కుట్ర CMO కనుసన్నల్లో యాక్షన్ టీమ్స్