కామారెడ్డి కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామాలు – బండ్లు ఓడలు, ఓడలు బండ్లు?

కాంగ్రెస్ లో బండ్లు ఓడలైతాయ్..ఓడలు బండ్లు ఐతాయ్ అనడంలో అతిశయోక్తి లేదు.. కాంగ్రెస్ లో ఏదైనా సాధ్యమే.. అచ్చం పచ్చి పులుసు అన్నట్లుగానే.. కామారెడ్డి కాంగ్రెస్ లో అలాంటి పరిణామాలే ఆసక్తికరంగా మారుతున్నాయి.. ప్రధాన స్రవంతి మీడియా ఈ పరిణామాలను పట్టించుకోకపోయినా...
రాష్ట్ర రాజకీయా యవనికపై ప్రత్యేక పరిణామాలపై "మన నిజామాబాద్"అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది..ఎవ్వరినో తక్కువ చేయాలని..ఇంకెవరినో ఆకాశానికెత్తాలనే ఉద్దేశం కాదు. వివరాల్లోకి వెళితే.....
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో ఉద్దండులైన మాజీ ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి,YS రాజశేఖర్ రెడ్డి లాంటి మహా మహులతో కలిసి పనిచేశారు ఆయన..
తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి PCC చీఫ్ గా నియా మకమైనపుడు సీనియర్లు రేవంత్ రెడ్డిని వ్యతిరేకించారు.. ఏ ఒక్క బడా నేత PCC చీఫ్ ను తమ జిల్లాలకు రమ్మనలేదు.. ఆ టైమ్ లో రేవంత్ రెడ్డిని మొదటిసారి తన ఇలాఖ కు వెంట పెట్టుకుని తీసికెళ్లారు ఆ ముఖ్యనేత... ఆయనెవరో కాదు ..ఉమ్మడి రాష్ట్రాలలో మోస్ట్ సీనియర్ బడా నేత షబ్బీర్ అలీ.. అంత వరకు బాగానే ఉంది.
కానీ...రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత షబ్బీర్ అలీ కి స్థాయికి తగ్గ అధికార హోదా తాలూకు గుర్తింపు లేదు.. రెండేళ్లుగా షబ్బీర్ ను ఈ పరిణామాలు వెంటాడుతున్నాయి..
మంత్రి పదవి రాకపోయే. సుదర్శన్ రెడ్డి కి సమాన ప్రోటోకాల్ పదవి రాకపోయే.. అయినా రాజకీయ ఒడిదుడుకులు ఎరిగిన నేత కాబట్టి సర్దుకు పోవడం అలవర్చుకున్నారు. అదే టైంలో నిజామాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రనేవచ్చాయి..అక్కడ అసెంబ్లీకి పోటీ చేసి ఓడి పోయారు కాబట్టి.. కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపికలో అన్నీ తానే అయ్యి చలాయించాలి..కానీ అక్కడా అది కుదరలేదు.. షబ్బీర్ సిట్టింగ్ స్థానమైన నిజామాబాద్ బల్దియా ఎన్నికల వ్యవహారం షబ్బీర్ అలీ నుంచి చేజారింది.. ఆ ఎన్నికల్లో అన్నీ తానే అయ్యి PCC చీఫ్ హోదాలో మహేష్ కుమార్ గౌడ్ చేలాయించారు. ఒకటి అర మీటింగులకు మాత్రమే అలీని పరిమితం చేశారు..
అదే టైంలో జరిగిన కామారెడ్డి మునిసిపల్ ఎన్నికల్లో అయినా మొత్తం వ్యవహారాలు షబ్బీర్ అలీ కనుసన్నల్లో జరరిగిందా అంటే..అదీ లేదు..జిల్లాలో అంతటా జరిగినట్లు కామారెడ్డిలో జరుగలేదు..
కామారెడ్డి అభ్యర్థుల ఎంపికలోనూ హాండ్ ఇచ్చారు.. అన్ని B ఫారాలు తనద్వారానే బట్వాడా జరుగాలనే కోరిక తీరలేదు..49 మందిలో 10 మంది అభ్యర్థుల B పారాలు షబ్బీర్ చేతికి చిక్కలేవు..
ఆయనతో అంటి ముట్టకుండా ఉంటూ..ముఖ్యమంత్రి, ఆయన తమ్ముడు కొండల్ రెడ్డితో చనువుగా ఉన్న యువ నేత గడ్డం చంద్ర శేఖర్ రెడ్డికి అందాయి.. వాటిని PCC చీఫ్ స్వయంగా అందచేయడం వెనుక ఉన్న ఆంతర్యం అర్దమ్ కాక..తలలు పండిన కాకలు తీరిన నేతలే ముక్కున వేలు వేసుకుంటున్నారు ఇప్పటికీ..
ఈ టికెట్ల బట్వాడా తరువాత చంద్ర శేఖర్ రెడ్డి టీమ్ ఉరుకులాట పెంచింది..జాబ్ మేళాలు.. స్వచ్చంద కార్యక్రమాల పేరిట నియోజకవర్గ మొత్తంలో కార్యకలాపాలు ఊపందుకున్నాయి.
అది ఎంత దూరం పోయిందంటే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేంత ఊతం ఇస్తోంది.. పంపరి శ్రీనివాస్ ద్వారా షబ్బీర్ అడ్డాగా ఉన్న మాచారెడ్డి ప్రాంతంలో అడుగులు పడుతున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటూనే..pcc చీఫ్ మహేష్ తో సఖ్యంగా ఉన్న షబ్బీర్ అలీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే ప్రయత్నాలకు అండగా దండగా ఉంటున్న దెవరనేది వేయి డాలర్ల ప్రశ్నగా మిగుతుతోంది..
కామారెడ్డి కాంగ్రెస్ లో ఏమి జరుగుతుందన్న రసవత్తర చర్చ జరుగుతోంది..
(జమాల్పూర్ గణేష్ మూల్పూరు రాజేంద్ర బాబు)
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

మంద కృష్ణ మాదిగపై కుట్ర CMO కనుసన్నల్లో యాక్షన్ టీమ్స్