లోపల దోస్తీ.. బయట కుస్తీ.. కాంగ్రెస్, బీజేపీ బంధంపై ఇందూర్‌లో చర్చ

లోపల దోస్తీ-బయట కుస్తీ కాంగ్రెస్,బీజేపీ బంధం ...... (జమాల్పూర్ గణేష్/మూల్పూరు రాజేంద్రబాబు) బీజేపీ,కాంగ్రెస్ ఫెవికాల్ బంధం మరోసారి బట్టబయలైంది ..దీనికి ఇందూర్ వేదిక అయ్యింది.. ప్రభుత్వంలో కీలక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెండు రోజుల నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రెండు రోజుల కార్యక్రమాల్లో బీజేపీ MLA లు ధన్పాల్ సూర్యనారాయణ గుప్త,రాకేష్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మొదటి రోజు ఆర్ముర్ MLA రాకేష్ రెడ్డి సోదరుడు రాజారెడ్డి నిజామాబాద్ లో నిర్మించిన పైడి కన్వెన్షన్ ను పొంగులేటి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు.. అదేరోజు రాకేష్ రెడ్డి స్వగ్రామం అంకపూర్ వెళ్లిన మంత్రి MLA ఆథిత్యాన్ని స్వీకరించారు. అదే ఊరిలో ఆర్ముర్ అసెంబ్లీ ఇంచార్జి, రాకేష్ రెడ్డితో రాజకీయ పోరు చేస్తున్న వినయ్ రెడ్డి లేకుండానే డబుల్ బెడ్ రూమ్స్ ను పరిశీలించారు మంత్రి పొంగులేటి.. శనివారం ఉదయం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సమావేశంలో అర్బన్ MLA గుప్త కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తారు.. అర్బన్ లో 1O ఏళ్లలో ఒక్కఇల్లు ఇవ్వలేదని BRS పై నిప్పులు చెరిగారు. అంతటితో ఆగకుండా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఆకాశానికి ఎత్తిన MLA గుప్త మరీ బతిమిలాడి సభికులతో కాంగ్రెస్ ప్రభుత్వానికి,మంత్రి పొంగులేటికి చప్పట్లు కొట్టించారు.. ఆతరువాత ఇద్దరు BJP MLA లు కలెక్టరేట్ లో మంత్రి,పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో కలిసి సమీక్షా సమావేశంలో ఉండగానే.... BJP రెండో అవతారాన్ని లోకానికి చాటి చెప్పింది.. లోపల తమ పార్టీ MLAలు అధికార పార్టీ ముఖ్య నేతలతో AC లో కూల్ గా సమావేశంలో ఉండగానే బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్ కొందరిని వెంటేసుకుని కలెక్టరేట్ లోకి చొచ్చుకొచ్చారు.. లక్షలాదిమంది భూములను నిషేధిత జాబితాలో చేర్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని ఆందోళనకు దిగారు. అక్కడే ఉన్న IDCMS మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి నాయకత్వంలో బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీజేపీతో ఫ్రెండ్లీ మ్యాచును తలపించారు. సినీ ఫక్కీలో పోలీసులు సైతం వారి పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించారు.. మొత్తానికి డ్రామా కనుల విందుగా సాగింది అనుకోండి.. లోపల దోస్తీ..బయట కుస్తీ అన్నట్టు ఉంది బీజేపీ,కాంగ్రెస్ వ్యవహారం అంటూ ముక్కున వేలేసుకోవడం ఇందూర్ వాసుల వంతు అయ్యింది..
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Popular posts from this blog

రూ.66 కోట్ల ధాన్యం మళ్లింపు కేసు.. నిజామాబాద్ రైస్ మిల్లు యజమానిపై కేసు నమోదు

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

PCC చీఫ్ పై ' బిగ్' కుట్ర -- మహేష్ ఇమేజ్ డ్యామేజ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!